'లీడర్' భామ ప్రియా ఆనంద్ తో సిద్ధార్థ్ సరసం
'లీడర్' లో రానాని రెచ్చగొట్టే పాత్రలో జీవించిన ప్రియా ఆనంద్ త్వరలో సిద్ధార్థతో సరసమాడబోతోంది. సిద్ధార్థ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకోబోతున్న చిత్రంలో హీరోయిన్ గా ఆమె ఎంపికైంది. యాడ్ ఫిల్మ్ మేకర్ జయేంద్ర దర్శకత్వంలో రూపొందే తమిళ, తెలుగు చిత్రం కోసం ఆమెను తీసుకున్నారు. తమిళంలో ఈ చిత్రం టైటిల్ 'పుతం పదు కలై' తెలుగులో ఇంకా పేరు పెట్టలేదు. ఈ ప్రాజెక్టుని సత్యం సినిమాస్ కిరణ్ రెడ్డి, ఆగల్ పిల్మ్స్ సి.శ్రీకాంత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మేజర్ పార్ట్ యుఎస్ లో జరగనుంది. ఇండోర్ షూటింగ్ మలేషియాలో చేస్తారు. కెమెరా మెన్ గా కెటి బాలసుబ్రమణ్యమ్ ని ఎంపిక చేసారు. రెడ్ కెమెరా తో దీన్ని షూట్ చేస్తారు. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం సిద్దార్ధ...సూర్యప్రకాశరావు రూపొందిస్తున్న సోషియో పాంఠసీ చిత్రంలోనూ, బావ అనే చిత్రంలోనూ చేస్తున్నారు. అలాగే ప్రియాఆనంద్..ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న 'రామ రామ...కృష్ణ కృష్ణ' లోనూ చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రామ్ హీరోగా లక్ష్యం వాసు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











