శేఖర్ కమ్ముల సినిమా రిలీజ్ డేట్
శేఖర్ కమ్ముల ప్రస్తుతం రాణా హీరోగా రూపొందించుతున్న లీడర్ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15)రోజున రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రామానాయుడు మనవడు..సురేష్ బాబు కుమారుడు అయిన రాణా ఈ చిత్రంతో హీరోగా పరిచయం కానుండటంతో అంతటా మంచి అంచనాలే ఉన్నాయి. యువత..రాజకీయాలు అనే పాయింట్ చుట్టూ తిరిగే కథతో తయారుఅవుతున్న ఈ చిత్రంలో రిచా, ప్రియా ఆనంద్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. గతంలో ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చిన ఎవియం ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సామాజిక సందేసంతో కూడిన ఈ చిత్రంలో రాణా పాత్ర ముఖ్యమంత్రి అవుతుందని టాక్ వినపిస్తోంది.
sekhar kammula rana ramanaidu leader independence day suresh babu richa శేఖర్ కమ్ముల రాణా లీడర్ రామానాయుడు సురేష్ బాబు రాజకీయాలు రిచా ప్రియా ఆనంద్


Click it and Unblock the Notifications