ఆగష్టు 15న లీడర్ లోగో విడుదల
ఏ.వి.యం. ప్రొడక్షన్స్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లీడర్" చిత్రం రూపొందుతోంది. రామానాయుడు మనవడు, సురేష్ బాబు తనయుడు రానా హీరోగా పరిచయమవుతున్న తొలి చిత్రం. గోదావరి తీరంలో ష్యూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ విజయవాడలో జరుగుతోందట. ప్రకాశం బ్యారేజ్ పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారని సమాచారం. ఆగస్ట్ 15 తేదిన ఈ సినిమాకి సంబంధించిన లోగో విడుదల చేస్తున్నారట. ఈ సినిమా టైటిల్ ని చూస్తుంటే ఇదొక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న కథని అనుకుంటారు. కానీ ఇదొక లవ్ స్టోరి అని తెలుస్తోంది.
avm suresh productions shekar kammula leader rana logo లీడర్ ఏవియం సురేష్ ప్రొడక్షన్స్ శేఖర్ కమ్ముల లోగో రానా రామానాయుడు సురేష్ బాబు


Click it and Unblock the Notifications