Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
లీడర్ రాణా సొంత వెబ్ సైట్ ఇదే...
లీడర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమవుతున్న దగ్గుబాటి రానా సొంత వెబ్ సైట్ ను లాంచ్ చేశారు. ranadaggubati.com పేరుతో తయారైన ఈ సైట్ గురించి రాణా మాట్లాడుతూ.. ప్రేక్షకులు, అభిమానులకు తాను అందుబాటులో ఉండేందుకు సొంత వెబ్ సైట్ ఉపకరిస్తుందనీ, తన అభిప్రాయాలు, అనుభవాలను వారితో పంచుకునేందుకు, ఆడియెన్స్ అభిప్రాయాలు, సూచనలు తెలుసుకునేందుకు కూడా వీలవుతుందనీ అన్నారు. ఈ వెబ్ సైట్ లో రానా సమచారం. ఫోటో గ్యాలరీ, డౌన్ లోడ్స్, ప్రత్యేక బ్లాగ్, ఫ్యాన్ జోన్, ఆయన తాజా చిత్రం 'లీడర్' కు సంబంధించిన ఆడియో, వీడియో వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫ్యాన్స్ పంపే ఫోటోలు, బ్యానర్ వీడియోలను కూడా అప్ లోడ్ కూడా చేస్తారు.
యువత..రాజకీయాలు అనే పాయింట్ చుట్టూ తిరిగే కథతో తయారుఅవుతున్న లీడర్ చిత్రంలో రిచా, ప్రియా ఆనంద్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. గతంలో ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చిన ఎవియం ప్రొడక్షన్స్ ఈ లీడర్ చిత్రాన్ని నిర్మిస్తోంది. సామాజిక సందేసంతో కూడిన ఈ చిత్రంలో రాణా పాత్ర ముఖ్యమంత్రి అవుతుందని వినికిడి. అలాగే దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని ఓ పొలిటికల్ ధ్రిల్లర్ గా అభివర్ణిస్తున్నాడు. తనికి ఈ చిత్రం ఐడియా ఎలా వచ్చిందనేది శేఖర్ గమ్మత్తుగా చెప్తున్నారు.
హ్యాపీడేస్ చిత్రం పూర్తి చేసి ఓ ఆరు నెలలు పాటు నెక్ట్స్ ప్రాజెక్టు గురించి ఆలోచనలో ఉండగా జనరల్ ఎలక్షన్స్ ఎనౌన్స్ చేసారు. దాంతో నేను టీవీ చానెల్స్ చూడటం ప్రారంభించాను. దాంతో నాకు పాలిటిక్స్ అనేవి అర్ధం అవటం ప్రారంభించాయి. దాంతో నేను ఈ పొలిటకల్ డ్రామా రాసాను. అన్నారు. అలాగని..ఈ చిత్రంలో ఎక్కడా రక్తపాతం,ఫైట్స్ ఉండవు..ఇదొక పొలిటికల్ ధ్రిల్లర్ మాత్రమే అని వివరించారు. ఇక ఈ చిత్రం ఆడియో మార్కెట్లో మంచి టాక్ తెచ్చుకుంది. మిక్కీ జె.మేయర్ అందించిన ట్యూన్స్ హ్యాపీడేస్ లా వర్కవుట్ అవుతున్నాయని అంటున్నారు.