»   » ఎన్టీఆర్ - కొర‌టాల కాంబోలో మరో మూవీ, అఫీషియల్ ప్రకటన!

ఎన్టీఆర్ - కొర‌టాల కాంబోలో మరో మూవీ, అఫీషియల్ ప్రకటన!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'జనతా గ్యారేజ్' తర్వాత ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్లో మరో సినిమా రాబోతోంది. ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూట‌ర్ గా పలు సినిమాలను పంపినీ చేసిన మిక్కిలినేని సుధాక‌ర్ ఈ సినిమా ద్వారా నిర్మాత‌గా మారబోతున్నారు.

ఎన్టీఆర్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన జ‌న‌తా గ్యారేజ్‌ అందుకున్న విజ‌యాన్ని ఇంకా తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ మ‌ర్చిపోలేదు. అంత‌లోనే ఈ స‌క్సెస్‌ఫుల్ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా వస్తుండటంతో అభిమానుల్లో ఆనందం నెలకొంది.

Leading distributor Mikkilineni Sudhakar turns producer with NTR-Koratala Siva's next

ఈ ప్రాజెక్టు గురించి మిక్క‌లినేని సుధాక‌ర్ మాట్లాడుతూ ఎన్నెన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను డిస్ట్రిబ్యూట్ చేశాను. ఆ అనుభవం తో నిర్మాత గా మారుతున్నాను. నా చిన్న నాటి స్నేహితుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో నా తొలి చిత్రాన్ని నిర్మించ‌డం మరియు ఇందులో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా నటించడం ఆనందం గా ఉంది. వారిద్దరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన జ‌న‌తా గ్యారేజ్‌ను ప్రేక్ష‌కులు అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. ఆ చిత్రాన్ని మించేలా, ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యంత భారీగా, మైలురాయిలా నిలిచిపోయేలా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తాం. మిగిలిన అన్ని వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తాం అని అన్నారు.

English summary
Leading distributor Mikkilineni Sudhakar is starting a new organisation Yuvasudha Arts under which he is set to produce a film with the successful combination of Young Tiger NTR and Koratala Siva who gave a blockbuster like Janatha Garage. Speaking about producing the film under his new banner, Sudhakar shares, “I have distributed many blockbuster films. And with that experience, I am turning a producer now. I am extremely excited about teaming up with Young Tiger NTR garu & my childhood friend Koratala Siva for my very first film. The film in their combination Janatha Garage has already been received very well and is still in the memories of the audiences. I aspire to make a film that will be another milestone for them. It will be a lavish production with no compromise in terms of anything. Other details will be revealed soon.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu