»   » లీక్ వీడియో: మహేంద్ర యాడ్ షూటింగ్ లో ప్రభాస్

లీక్ వీడియో: మహేంద్ర యాడ్ షూటింగ్ లో ప్రభాస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాహుబలితో ఓ రేంజిలో పేరు తెచ్చుకున్న ప్రభాస్ మహేంద్రవారి TUV300 కు నేషనల్ అంబాసిడర్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రభాస్ తో యాడ్ ని షూట్ చేసారు. ఈ యాడ్ షూటింగ్ ని కొంతమంది అభిమానులు షూట్ చేసి ఇదిగో ఇలా వీడియోతో సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో తమ తోటి అభిమానులతో పంచుకుంటున్నారు. ఆ వీడియోని మీరు ఇక్కడ చూడండి.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఈ యాడ్ లో కేవలం ప్రభాస్ వచ్చి ఈ వెహికల్ గురించి చెప్పటమే కాదు కొన్ని ఊపిరిబిగపట్టే సాహసమైన స్టంట్స్ చేసారు. ఈ స్టంట్స్ ని బాలీవుడ్ పాపులర్ యాక్షన్ డైరక్టర్ పర్వీజ్ షేక్ అందించారు.


మహేంద్ర మేనేజ్మెంట్ ఈ యాడ్ ని లావిష్ గా భారీ బడ్జెట్ తో తీసారు. టీవిలో ఈ విజువల్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా స్టన్ చేస్తాయి అంటున్నారు.


ఇక...


Leak Video: Prabhas's Mahindra Ad Shooting

బాహుబలి విడుదలై 50 రోజులు పూర్తి చేసుకుంది. తెలుగు, తమిళం, మళయాలం, హిందీ, ఫ్రెంచి భాషల్లో ఈ సినిమా జులై 10న ప్రేక్షకులను పలకరించింది. విడుదలైంది మొదలు బాక్సాఫీసు వద్ద కనక వర్షం కురిపిస్తూ భారత చలన చిత్ర పరిశ్రమలో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకుంది. విడుదలైన మొదటి రోజే 68 కోట్లను వసూలు చేసింది.


భారత్‌లో అన్ని భాషలను కలుపుకొని మొదటి వారం 178 కోట్లను, ప్రపంచవ్యాప్తంగా 255 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. మొదటి వీకెండ్‌లో 162 కోట్లను రాబట్టిందీ చిత్రం. 9 రోజుల్లోనే 300 కోట్లను రాబట్టి ఆ క్లబ్‌లో చేరిన మొదటి దక్షిణాది చిత్రంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 401 కోట్లను 15 రోజుల్లోనే రాబట్టింది. తదనంతరం 500 కోట్ల క్లబ్‌లో చేరింది.


ఈ క్రమంలో హిందీ వర్షెన్‌లో 100 కోట్లకు పైగా వసూలు చేసి ఆ ఘనత సాధించిన మొదటి డబ్బింగ్ చిత్రంగా నిలిచింది. భారత్‌లో అత్యధిక వసూళ్ళను రాబట్టిన మూడో చిత్రంగా నిలిచింది బాహుబలి. ఇప్పటి వరకు 600.95 కోట్లను బాహుబలి వసూలు చేసినట్లు ఓ అంచనా.

English summary
Prabhas has accepted to act as national brand ambassador for Mahindra's new beast, TUV300. Shoot for the ad is currently going on. Making visuals of the ad have been leaked online.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu