»   » లీకైంది: అఖిల్ అక్కినేని డాన్సింగ్ వీడియో హల్ చల్

లీకైంది: అఖిల్ అక్కినేని డాన్సింగ్ వీడియో హల్ చల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అఖిల్ అక్కినేని వివి వినాయక్ దర్శకత్వంలో హీరోగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా స్పెయిన్లో ఇందుకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. ఈ రోజుతో షూటింగ్ ముగియనుంది. షూటింగ్ అయిన వెంటనే యూనిట్ సభ్యులంతా హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కాబోతున్నారు. అయితే వీరు ఇంకా ఇండియాలో ఎంటర్ కాకముందే ఈ షూటింగుకు సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో లీకైంది. సోషల్ మీడియాలో ఈ వీడియో హల్ చల్ చేస్తోంది.

ఈ వీడియో లీక్ సంగతి, సోషల్ మీడియాలో వైరల్ లా స్ర్పెడ్ అయిన సంగతి తెలిస్తే చిత్ర యూనిట్ ఏ రేంజిలో హర్ట్ అవుతుందో తెలియదు కానీ.....అక్కినేని ఫ్యామిలీ అభిమానులు మాత్రం అఖిల్ డాన్సింగ్ మూమెంట్స్ చూసి సంబరపడిపోతున్నారు. అఖిల్ ఇందులో సూపర్బ్ గా డాన్స్ చేయడం ఆకట్టుకుంటోంది.

LEAKED: Akhil Akkineni Dancing Video Going Viral

టాలీవుడ్లో అక్కినేని నాగేశ్వరరావు అప్పట్లో మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత వచ్చిన నాగార్జున, నాగ చైతన్య మాత్రం తమ పోటీ స్టార్లతో పోలిస్తే డాన్స్ విషయంలో ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్నారు. అయితే అఖిల్ అక్కినేని మాత్రం డాన్స్ విషయంలో ఇరగదీస్తుండటంపై ప్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఫోటో ఆ లీకైన వీడియో నుండి తీసిన స్నాప్ షాట్లే.

అఖిల్‌ అక్కినేని, సాయేషా సైగల్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, మహేష్‌ మంజ్రేకర్‌, వెన్నెల కిషోర్‌, సప్తగిరితోపాటు మరి కొంతమంది ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: అమోల్‌రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.

English summary
Akhil Akkineni and his team returned from Spain after a long song schedule in Spain only today, But before they coming to India, a video from the shoot went on to go viral on social networking sites.
Please Wait while comments are loading...