»   » దారుణం: ఆ హీరోయిన్ నటించిన సీన్లు చూపి పోర్న్ సీడీలుగా అమ్మేస్తున్నారు!

దారుణం: ఆ హీరోయిన్ నటించిన సీన్లు చూపి పోర్న్ సీడీలుగా అమ్మేస్తున్నారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా రిలీజ్ ముందే ఇంటర్నెట్లో లీక్ అయితే, వాటిని సీడీలుగా మార్చి పోర్న్ సినిమాల కేటగిరీలో అమ్మేస్తే దారుణం కాక మరేమిటి.... తాజాగా రాధిక ఆప్టే నటించిన 'పర్చేడ్' సినిమా విషయంలో అదే జరుగుతోంది.

'పర్చేడ్' సినిమాకు సంబంధించిన కొన్ని హాట్ సీన్లు ఇటీవల ఇంటర్నెట్లో లీకైన సంగతి తెలిసిందే. రాధిక ఆప్టే, ఆదిల్ హుస్సేన్ కలిసి ఇందులో ఓ శృంగార సన్నివేశంలో న్యూడ్ గా నటించారు. ఆ సీన్లు కొన్ని రోజుల క్రితం ఇంటర్నెట్ లో లీక్ అవ్వడం సంచలనం అయింది. త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమా పబ్లిసిటీ కోసమే వాటిని ఆ సినిమాకు సంబంధించిన వారే అనే అనుమానం ఉండేది.

కానీ లీక్ వెనక ఉన్నది వారు కాదని స్పష్టం అయింది. ఎందుకంటే సినిమా ఫుల్ వెర్షన్ పైరసీ కోల్‌కతా వీధుల్లో లభ్యమవుతున్నాయి. పోర్న్ సినిమాల ప్యాకేజీ కింద ఈ సినిమాను జతచేసి అమ్మేస్తున్నారు. సెప్టెంబర్ 23న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కావాల్సి ఉంది. పైరసీ విషయం తెలియడంతో నిర్మాతల లబోదిబోమంటున్నారు.

సెన్సార్ చేయని హై క్వాలిటీ మూవీ కేవలం రూ. 90 కే మార్కెట్లో లభ్యమవుతుండటం నిర్మాతలను కలవరానికి గురి చేస్తోంది.

రాధిక-ఆదిల్

రాధిక-ఆదిల్

సినిమాలో తాము ఇద్దరం కలిసి శృంగార సన్నివేశాల్లో నటించింది నిజమే, అలాంటి సీన్లు చేసినందుకు సిగ్గుపడటం లేదు, ఎందుకంటే అది నటనలో భాగం అని ఇటీవల ఆదిల్ హుస్సేన్ ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

వీరే లీక్ చేసారని అనుకున్నారు

వీరే లీక్ చేసారని అనుకున్నారు

అయితే సినిమాలోని శృంగార సన్నివేశాలు మాత్రమే లీక్ కావడంతో పబ్లిసిటీ కోసమే సినిమా వారు వీటిని లీక్ చేసారని అనుమానం ఉండేది అందరికీ. అయితే ఈ వాదనను యూనిట్ సభ్యులు ఖండించారు.

పర్చేడ్ మూవీ కథ

పర్చేడ్ మూవీ కథ

నలుగురు సాధారణ మహిళలకు సంబంధించిన కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. రాణి, లజ్జో, బిజిలి, జానకి చుట్టూ సినిమా కథ తిరుగుతుంది. సెప్టెంబర్ 23న సినిమా రిలీజవుతోంది.

అవార్డ్స్

అవార్డ్స్

ఈ సినిమాను నిర్మించిన అజయ్ దేవగన్ సినిమా గురించి మాట్లాడుతూ...‘సినిమాను నేను ప్రజెంట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇప్పటికే 18 అవార్డులు వచ్చాయి. 24 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించబడింది. సెప్టెంబర్ 9న ట్రైలర్ రిలీజ్, సెప్టెంబర్ 23న సినిమా రిలీజ్ చేస్తున్నామని తెలిపారు.

తారాగణం

తారాగణం

ఈ సినిమాలో రాధిక ఆప్టే, ఆదిల్ హుస్సేన్, సుర్వీన్ చావ్లా, తనిష్ఠా చటర్జీ, సయానీ గుప్తా నటిస్తున్నారు. పలు ఫల్మ్ ఫెస్టివల్స్ లో ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిసింది.

శృంగార సన్నివేశాలు

శృంగార సన్నివేశాలు

ఇటీవల ఇంటర్నెట్లో లీక్ అయిన శృంగార సన్నివేశాలతో ఈ సినిమా హాట్ టాపిక్ అయింది. ఈ వివాదమే సినిమాకు మంచి పబ్లిసిటీ తెచ్చిపెట్టింది.

ఆదిల్ హుస్సేన్ షాక్

ఆదిల్ హుస్సేన్ షాక్

అయితే ఇంటర్నెట్లో లీక్ అయిన వీడియోకు రాధిక ఆప్టే సెక్స్ వీడియో అని పేరు పెట్టడంపై ఆదిల్ హుస్సేన్ మండి పడ్డారు. అందులో నేను కూడా ఉన్నా... ఆదిల్ హుస్సేన్ సెక్స్ వీడియో అని ఎందుకు పిలవడం లేదు? మహిళలంటే అదో రకమైన భావం ఉండబట్టే వారిని బ్లేమ్ చేస్తున్నారు అంటూ ఇటీవల ఇంటర్వ్యూలో మండి పడ్డారు.

సెక్స్ గురించి ఓపెన్ గా

సెక్స్ గురించి ఓపెన్ గా

మన సమాజంలో సెక్స్ గురించి ఓపెన్ గా మాట్లాడే పరిస్థితులు ఇప్పటకీ లేవు. ఇలాంటివి మారాల్సిన పరిస్థితి ఉంది అంటూ ఆదిల్ హుస్సేన్ ఇటీవల ఇంటర్వ్యూలో అభిప్రాయ పడ్డారు.

ఎలా లీకైందో...

ఎలా లీకైందో...

సినిమాను వివిధ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించారు. అక్కడి నుండే సినిమా లీక్ అయిందని భావిస్తున్నారు.

మార్కెట్లో కేవలం రూ. 90

మార్కెట్లో కేవలం రూ. 90

పర్చేడ్ మూవీ ఫుల్ వెర్షన్ మార్కెట్లో కేవలం రూ. 90కే లభిస్తుందని తెలుస్తోంది.

English summary
Not so long ago, some intimate scenes from Ajay Devgn's production venture Parched starring Radhika Apte, Adil Hussain and others were leaked on the Internet. And soon the leaked clip went viral on the Internet. Now, the film is being sold as an adult film in Kolkata.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu