‘అ..ఆ’...నితిన్, సమంత ఫస్ట్ లుక్ లీక్!
హైదరాబాద్: టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ నితిన్ హీరోగా సినిమా చేస్తున్నసంగతి తెలిసిందే. ‘అ...ఆ' (అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి) టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదలైనా....అందులో హీరో హీరోయిన్ల ఫోటోలు మాత్రం కనిపించలేదు.
తాజాగా నితిన్, సమంతలకు సంబంధించిన ఫోటో ఒకటి లీక్ అయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హీరో నితిన్ తొలిసారిగా నటిస్తుండగా సూర్యదేవర రాధాకృష్ణ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలను త్రివిక్రమ్ స్వయంగా చూస్తున్నారు.
సినిమాలో మెయిన్ హీరోయిన్ గా సమంత నటిస్తుండగా.... మరో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. త్రివిక్రమ్ గత సినిమా ‘అత్తారింటికి దారేది' మూవీలో కీలక పాత్ర పోషించిన నటి నదియా కూడా ఇందులో ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.
ఈ సినిమాను ఏప్రిల్ 22న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ సమయంలో రిలీజ్ చేయడం హాట్ టాపిక్ అయింది. మహేష్ బాబు నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం' మూవీ ఏప్రిల్ 29న విడుదలవుతోంది. మహేష్ బాబు సినిమాలు ఎలాగూ అనుకున్న సమయానికి రిలీజ్ కావు.... వాయిదా పడే అవాకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని ముందే గ్రహించిన త్రివిక్రమ్ ఇలా ప్లాన్ చేసాడని అంటున్నారు. మరి త్రివిక్రమ్ ప్లాన్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

లీక్ ఫోటో
తాజా నెట్లో లీకైన ఫోటో ఇదే. అఫీషియల్ గా మాత్రం ఇది రిలీజ్ కాలేదని స్పష్టమవుతోంది.

రిలీజ్
ఈ సినిమాను ఏప్రిల్ 22న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సినిమాటోగ్రఫీ
ప్రముఖ సౌత్ సినిమాటోగ్రాఫర్ నటరాజన్ సుబ్రహ్మణ్యం ఈ సినిమాకు పని చేస్తున్నారు.

తెర వెనక
కళ: రాజీవన్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, సౌండ్ డిజైనింగ్: విష్ణుగోవింద్, శ్రీశంకర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్...పిడివి ప్రసాద్. ఈ సినిమాని శ్రీమతి మమత సమర్పిస్తున్నారు.


Click it and Unblock the Notifications











