twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమాతో చదువుకోవచ్చా?

    By Staff
    |

    Garam Hawa
    నేటి బాలలే రేపటి పౌరులు..పిల్లలకు చిన్నతనం నుంచే సామాజిక సమస్యలమీద సరైన అవగాహన ఉంటే వారు పెద్దయ్యాక గొప్ప వ్యక్తులవుతారని ఎన్.సి.ఆర్.టి వారు భావిస్తున్నారు. అందుకు సినిమాను ఎడ్యుకేషన్ టూల్ గా ఉపయోగించటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. జనవరి నుంచి ఆ తరహా ప్రయోగాలు ప్రారంభం కానున్నాయి. గరమ్ హవా, హకీత్, జంజీర్ వంటి కొన్ని ఎంపిక చేసిన సినిమాలతో సామాజిక సమస్యలమీద కొంత అవగాహన వచ్చే అవకాశముందని వారు ముందుకెళ్తున్నారు. అయితే ఇవి ఏ తరగతి నుంచి ప్రారంభించాలనే విషయంపై కసరత్తులు జరుగుతున్నాయి. ఇంటర్ లో పొలిటికల్ సైన్స్ కి ఈ సినిమాలను స్టడీ మెటీరియల్ గా పెట్టాలని కొందరు ప్రపోజల్స్ పెట్టారు. ఇక ఈ విషయమై ఎన్ సి ఆర్ టి ప్రతినిధి డాక్టర్ మల్లా ప్రసాద్ మాట్లాడుతూ సినిమాలను కంపల్సిరి అని అనం..అలాగే వీటిపై పరీక్షలు పెట్టం..కానీ మేం నెలల తరబడి చెప్పే విషయాలని ఇవి గంటల్లో ప్రభావవంతగా బోధిస్తాయనటంలో సందేహం లేదు..అందుకే జనవరి నుంచి ప్రయోగాత్మకంగా వీటిని ప్రారంభించనున్నాం అంటున్నారు.

    ఇదే విషయంపై యోగీంద్ర యాదవ్(CSDS) మాట్లాడుతూ నాకు పర్శనల్ గా ఇప్పటికీ గుర్తు ఉంది. గరమ్ హవా సినిమా నాపై చాలా ప్రభావం చూపింది. నేను దేశ విభజన ను పుస్తకాల్లో చదువుకున్నాను కానీ ..నేను ఆ సినిమా చూసాక విభజన పరిణామాలు, ముస్లిం కుటుంబాలు ఏ విధమైన ఇబ్బంది పడ్డారో స్పష్టంగా అర్ధమైంది. అలాగే ఆక్రోశ్ చూసాక ఆదివాసి అంటే ఏమిటో అర్ధం తెలిసింది అంటూ సినిమాలు..సమాజంపై ప్రభావం గురించి చెప్పుకొచ్చారు.

    ఇక రీజనల్ పిల్మ్స్ లో మారాఠి సినిమా సింహాసన్,తమిళ రోజా,సత్యజిత్ రే పధేలీ పాంచాలి సినిమాలు పెడదామనే నిర్ణయానికి వచ్చారు. ఇక ఈ చిత్రాల ప్రదర్శన కోసం స్కూల్స్ లో కొన్ని పరికరాలు(టెలివిజన్ వంటివి) ఏర్పాటు చేయటానికి నిర్ణయించారు. ఇవన్నీ ఒకెత్తు అయితే మన తెలుగు సినిమా ఒక్కటీ ఈ లిస్టులో లేకపోవటం విచారకరమే.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X