'బృందావనం' చేసేటప్పుడు కాజల్ నుంచి నేర్చుకున్నా
"నేను, కాజల్ కలిసి బృందావనంలో పనిచేసినప్పుడు ఆమె పనితీరును గమనించాను. 'మగధీర' అంత పెద్ద సక్సెస్ అయినా దాని తాలూకు గర్వం ఆమెలో కొంచెమైనా లేదు. ఎంతో సింపుల్ గా, అందరినీ పలుకరించే తత్వం నన్ను బాగా ఆకట్టుకుంది అంటూ కాజల్ ని పొగడ్తల్లో ముంచెత్తింది సమంత. అలాగే కాజల్ గురించి చెబుతూ...ఒక సీనియర్ గా ఆమె నుంచి నేను నేర్చుకున్న అంశాల్లో సింప్లిసిటీ కూడా ఒకటి. గొప్పస్థానాలకు ఊరికే ఎవరూ వచ్చేయరు అనే విషయం ఆమెను చూసి మరోసారి తెలుసుకున్నాను అంది..'ఏ మాయ చేసావె', 'బృందావనం' చిత్రాలతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మహేష్ సరసన దూకుడు చిత్రం, రాజమౌళి దర్శకత్వంలో ఈగ చిత్రం చేస్తోంది. అలాగే తన గురువు గౌతమ్ మీనన్ తాజా చిత్రం 'ఎర్రగులాబీలు' లోనూ ఈమె గెస్ట్ రోల్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











