'బాహుబలి': చూడటానికి లీవ్ లెటర్ ఎలా రాయాలి? ఇదిగో ఇలా

By Srikanya

హైదరాబాద్ : ప్రభాస్, రానా, అనుష్క తమన్నాలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల్లో జూలై 10న భారీ ఎత్తున బాహుబలి విడుదల కానున్న విషయం తెలిసిందే. అదే రోజున ఈ చిత్రం చూడాలని చాలా మందికి ఉంటుంది. అయితే మరి ఆ రోజు ఆఫీసులకు సెలవు ఇవ్వరు కదా..శెలవు పెట్టాల్సిందే. ఆ లీవ్ లెటర్ ఎలా రాయాలి అన్న దానకి బాహుబలి టీమ్ ఓ లీవ్ లెటర్ ని ప్రిపేర్ చేసింది.

మీరూ ఈ లెటర్ వాడుకోవచ్చేమో చూడండి.

కేవలం భారతదేశంలోని సినీ ప్రియులే కాదు...ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'బాహుబలి'. భారతీయ పరిశ్రమ నుంచి రాబోతున్న ఓ అద్భుత చిత్రంగా ఈ సినిమాను కొనియాడుతున్న ఈ సినిమా ప్రచారంలో భాగంగా ప్రతిష్ఠాత్మక బీబీసీతో రాజమౌళి మాట్లాడారు. ఆ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం బీబీసీ ఆసియా విభాగంలో ప్రసారం చేశారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించిన చిత్రం ‘బాహుబలి' . ఈ చిత్రం సెన్సార్ రీసెంట్ గా పూర్తైన సంగతి తెలిసిందే. 2 గంటలు 39 నిముషాలు ఉన్న ఈ చిత్రానికి U/A రేటింగ్ ఇవ్వటం జరిగింది.

ఈ చిత్రం విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇప్పటికే విడుదలైన ‘బాహుబలి' ట్రైలర్లు, పాటలకు మంచి ప్రజాదరణ దక్కుతోంది. జూలై 10న ప్రపంచ వ్యాప్తంగా సుమారు నాలుగు వేలకు పైగా ధియేటర్లలో విడుదల అవుతోంది.

అలాగే ఈ చిత్రం రీసెంట్‌గా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని ‘యు/ఎ' సర్టిఫికేట్ పొందింది. ఈ చిత్రాన్ని చైనా లాంటి దేశాల్లో సైతం రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

బాహుబలి ది బిగినింగ్ విడుదలకు దగ్గరవడంతో సినిమా యూనిట్ ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. సాంప్రదాయ ప్రెస్, మీడియా ప్రచారాలతో పాటు సోషల్ మీడియాలోనూ ప్రచార కార్యక్రమాలతో ‘బాహుబలి' దూసుకుపోతోంది. గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వస్తోన్న బాహుబలి టీమ్ సోషల్ మీడియా ద్వారానే ఈ స్థాయి ప్రచారాన్ని సొంతం చేసుకుంది.

Leave of Absence – Just for Baahubali

ఇక సోషల్ మీడియా ప్రమోషన్లలో భాగంగా మమతల తల్లి వీడియో సాంగ్‌ను విడుదల చేయగా ఆ పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక నేడు బాహుబలిలోని నిప్పులే శ్వాసగా పాటకు సంబంధించిన వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. కాగా ఈ పాటలో ఇంతకుముందు చూసిన చాలా షాట్లను మళ్ళీ చూపించారు.

అయితే కొన్ని కొత్త షాట్స్ కూడా జతచేయడంతో సాధారణంగానే ప్రతీ కొత్త షాట్‌కూ అభిమానులు సినిమాపై అంచనాలు పెంచేసుకుంటున్నారు.

ఈ చిత్రంలో ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రానా ఇతర ముఖ్య పాత్రధారులు. ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మాతలు. కె.రాఘవేంద్రరావు సమర్పకుడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అంతర్జాలంలో మంచి స్పందన వస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X