Kaali పోస్టర్ వివాదం.. పెట్టుబడిదారుల అంతమే.. మరో కాంట్రవర్సీ ట్వీట్‌తో డైరెక్టర్

కాళీమాత నోట్ల సిగరెట్ పెట్టి పోస్టర్ రిలీజ్ చేయడంతో దర్శకురాలు లీనా మణిమేఖలైపై హిందుత్వ సంస్థలు, హిందుత్వవాదులు భగ్గుమన్నాయి. దేశవ్యాప్తంగా పలుచోట్ల లీనా మణిమేఖలైపై కేసులు, ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. అయితే కేసులకు భయపడకుండా దర్శకురాలు లీనా ఘాటుగా స్పందించారు. తాజాగా లీనా చేసిన ట్వీట్ మరోసారి సినీ, రాజకీయ, సాధారణ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

దర్శకురాలు లీనా మణిమేఖలై ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టి.. నా కాళీ వినాశనకారిణి. ఆమెకు స్వేచ్ఛాయుతమైన స్పూర్తి ఉంది. పితృస్వామ్యంపై తిరుగుబాటు చేస్తుంది. హిందుత్వాన్ని ధ్వంసం చేస్తుంది. నా కాళి పెట్టుబడిదారులను కూల్చివేస్తుంది. ఆమె ప్రతీ ఒక్కరిని వేయి చేతులతో ఆలింగనం చేసుకొంటుంది అని ట్వీట్ చేశారు.

 Leena Manimekalai says that My Kaali destroys capitalism

లీనా మణిమేఖలై గత రెండు రోజులుగా వివాదాస్పదమైన ట్వీట్లతో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. కాళీమాత వేషధారిణి సిగరెట్ తాగుతున్న ఫోటోను షేర్ చేసి సంచలనం రేపారు. ఈ పోస్టర్ వైరల్ కావడం, హిందుత్వ వాదులు ఆగ్రహానికి గురైంది. కెనడాలో రిలీజైన ఈ పోస్టర్‌ను తొలగించాలని హిందుత్వ వాదులు ఆ దేశ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ వివాదాన్ని, లీనా మణిమేఖలై తీరును నిశితంగా పరిశీలిస్తున్నది.

కాళి అనే డాక్యుమెంటరీ మూవీని లీనా మణి మేకలై అనే దర్శకురాలు రూపొందించారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. అయితే ఫస్ట్ లుక్‌లో కాళీ మాత వేషధారి సిగరెట్ తాగుతూ కనిపించింది. మంచిగా దమ్ముకొడుతూ తన్మయత్వంతో ధూమపానాన్ని ఆస్వాదిస్తున్నట్టు కనిపించింది. కాళీ మాత పోస్టర్‌ను తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి ట్వీట్ చేస్తూ.. కెనడాలోని ఆగాఖాన్ మ్యూజియంలో కాళీ డాక్యుమెంటరీ పోస్టర్‌ను ఆవిష్కరించడం చాలా థ్రిల్లింగ్‌గా, ఎక్సైటింగ్‌గా ఉంది. ఈ డాక్యుమెంటరీని మీ ముందుకు తీసుకువస్తున్న నేపథ్యంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని లీనా సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X