కాపీ కొట్టారు: ‘జబర్‌దస్త్’ దర్శక నిర్మాతలపై చర్యలు!
హైదరాబాద్: సిద్ధార్థ-సమంత హీరో హీరోయిన్లుగా నందినీరెడ్డి దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మించిన 'జబర్‌దస్త్' సినిమా ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా హిందీ సూపర్ హిట్ మూవీ 'బ్యాండ్ బాజా భారత్' చిత్రానికి కాపీలా ఉందనే అభిప్రాయం సినిమా చూసిన ప్రతి వారిలో వ్యక్తం అవుతోంది.
'బ్యాండ్ భాజా భారత్' సినిమా హిట్టయిన నేపథ్యంలో ఇదే సినిమాను తమిళం, తెలుగు భాషల్లో నాని హీరోగా రీమేక్ చేయడం ద్వారా సౌత్ సినిమా ఇండస్ట్రీలో ప్రవేశించాలని ప్లాన్ చేసుకున్న యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ ఇప్పటికే సినిమాను కూడా మొదలు పెట్టింది. ఈ లోగా తమ సినిమా పోలికలతో 'జబర్‌దస్త్' సినిమా తెలుగులో విడుదల కావడంతో ఖంగు తిన్నారు.
తమ సినిమాను కాపీ కొట్టడంపై 'బ్యాండ్ బాజా భారత్' నిర్మాణ సంస్థ 'యశ్ రాజ్ ఫిలింస్' వారు 'బబర్‌దస్త్' చిత్ర దర్శక నిర్మాతలపై చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఓ ఆంగ్ల దిన పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం, యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ మార్కెటింగ్-కమ్యూనికేషన్ విభాగం వైస్ ప్రెసిడెంట్ రఫిక్ గంగ్‌జీ 'జబర్‌దస్త్' సినిమా మేకర్స్‌పై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
అయితే 'జబర్ దస్త్' దర్శకురాలు నందినీరెడ్డి వాదన మరోలా ఉంది. వివిధ భాషల్లో రూపొందిన 23 సినిమాల ఆధారంగా 'జబర్ దస్త్' సినిమా రూపొందించినట్లు ఆమె చెప్పుకొచ్చారు. 'బ్యాండ్ బాజా భారత్' చిత్రానికి 'జబర్ దస్త్' కాపీ అనే ప్రచారాన్ని ఆమె ఖండించారు. బ్యాండ్ బాజా భారత్ సినిమాలో హీరో హీరోయిన్లు వెడ్డింగ్ ప్లానర్స్ అయితే, తమ సినిమాలో హీరో హీరోయిన్లు ఈవెంట్ మేనేజర్లు. ఆ సినిమాకు ఈ సినిమాకు పొంతన లేదని నొక్కి వక్కానిస్తున్నారు. మరి ఏం జరుగబోతోందో? యశ్ రాజ్ ఫిలింస్ వారు అన్న మాట ప్రకారం కోర్టు వరకు వెళతారా? వేరే మార్గాల్లో సెటిల్మెంట్ చేసుకుంటారా? వెయిట్ అండ్ సీ...


Click it and Unblock the Notifications











