పోన్ నెంబర్ ఇచ్చి ఇరుక్కుపోయిన స్టార్
అమితాబ్ కి కోర్టు నోటీసులు ఇప్పించబోతోంది. సెప్టెంబర్ 12 వ తేదీన ప్రసారమయిన కౌన్‌బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వ్యక్తి ఒకరు అమితాబ్‌ను ఎంతో అభిమానంగా 'మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్' అని అడిగాడు. బచ్చన్ వెంటనే 987730000 అంటూ తన నెంబర్ ఇచ్చేశారు. అయితే ఇందులో తొమ్మిది నెంబర్లే ఉన్నాయి. పది నెంబర్లు ఉంటే కదా ఫోన్ పనిచేసేది. పొరపాటున ఒక నెంబర్ తక్కువ చెప్పారేమోనని అమితాబ్ చెప్పిన నెంబర్ చివర్లో సున్నా కలిపి ఫోన్లు చేయడం మొదలుపెట్టారు అమితాబ్ అభిమానులు. అది కాస్తా ఫతేగఢ్ జిల్లా గోవింద్‌గఢ్ మండీలో నివసిస్తున్న పునీత్ బన్సాల్ అనే పారిశ్రామిక వేత్త సోదరి ఫోన్ నెంబర్ అయి కూర్చుంది. ఈ నెంబర్‌కి సెప్టెంబర్ 12 వ తేదీ రాత్రి దేశవిదేశాల నుంచి వచ్చిన కొన్ని వేల ఫోన్లు వచ్చాయి. వాటిని రిసీవ్ చేసుకుని 'అమితాబ్ పొరపాటున చెప్పి ఉంటారు. ఇది ఆయన నెంబర్ కాదని' చెప్పి చెప్పి విసుగెత్తిపోయారట వాళ్లు. ఆఖరికి మొబైల్ సర్వీస్ ప్రొవైడర్‌ని సంప్రదించినప్పటికీ వెంటనే ఉపశమనం లభించలేదు. తాము ఎదుర్కొన్న ఇబ్బందికి గాను బన్సాల్ కుటుంబసభ్యులు అమితాబ్‌కు లీగల్ నోటీసు పంపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











