‘ఆర్య 2’ కి లీగల్ నోటిస్????
ఈ మధ్య సిన్మాలపై నిలదీతలు ఎక్కువయిపోయాయి. ఏదో ఒకటి కాపీ కొట్టుకుని తీయడం ఆ తర్వాత రచయితలో కవులో వీధికెక్కి గోలచెచడం ఆ తరువాత నిర్మాత ఏదోకొంత చేతిలో పెట్టి కథసుఖాంతం అనిపించడం తరచు జరుగుతోంది. ఓలాయర్ కు ఆర్య పాటలు మహా చెడ్డవిగా విన్పించాయి. ఎప్పట్నించో సినీ పాటల సాహిత్యం భ్రష్టు పట్టిందని ఎవరైనా అంటే ఇప్పట్నించి అడ్డుకట్టలేద్దాం అని ఆ లాయర్ చెబుతూ ఒక నోటీస్ సదరు నిర్మాతకు పంపించారు. అదేదో కాదండి....
అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న 'ఆర్య - 2" చిత్రంపై అప్పుడే వివాదం ముసురుకుంది. 'ఆర్య-2" ఆల్బయ్ లో అందర్నీ విశేషంగా ఆకట్టుకుంటోన్న 'రింగ రింగా" పాటమీదే ఈ వివాదం ఫోకస్ అయ్యింది. విషయమేంటంటే, మొట్ట మొదట ఈ పాట వినగానే 'ఛీ..ఛీ..ఎంత వల్గర్ గా" వుందో " అనుకున్నవారే. అయితే, సినిమా పాట కాబట్టి, అందులోనూ ఐటమ్ సాంగ్ కాబట్టి, ఛల్తా... అని చాలామంది సరిపెట్టుకున్నారు.
కానీ, లోక్ సత్తా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. లోక్ సత్తా లీగల్ సెల్ కు చెందిన సీవీఎల్ నరసింహారావు ఈ పాట విషయమై సినిమా దర్శక నిర్మాతలకు, మ్యూజిక్ కంపెనీకీ లీగల్ నోటీసులు పంపించారు. ఈయనా సినీ నటుడేలెండి చాలా తెలుగు సినిమాల్లో సీవీఎల్ ని మనం వివిధ పాత్రల్లో చూసేశాం. 'రింగ రింగా..." పాట అసభ్యంగా రాశారనీ, వినడానికి పాపం చేసుకున్నామనీ ఆయన ఆవేదం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా పబ్లిసిటీ స్టంటేననీ, వ్యక్తిగతంగా పబ్లిసిటీ పొందడానికో, సినిమాపై దుమారం రేపడానికో ఇదంతా చేస్తున్నారంటూ సినీ పరిశ్రమకు చెందిన పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.


Click it and Unblock the Notifications











