twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘లెజెండ్’ 200 డేస్ వేడుక వాయిదా పడింది

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ నటించిన ‘లెజెండ్' చిత్రం భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 100 రోజులు పూర్తి చేసుకుని 175 డేస్ మార్కును సైతం క్రాస్ అయిన ఈ చిత్రం 200 రోజులు మార్కును అందుకుంది. ఎమ్మిగనూరులోని మిని శివ థియేటర్లో డైరెక్ట్ 4 ఆటలతో 200 రోజులు పూర్తి చేసుకుంది.

    ఈ నేపథ్యంలో ఈ నెల 12న వేడుక జరిపేందుకు అభిమానులు ఏర్పాట్లు చేసారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బి.జయనాగేశ్వర రెడ్డి బాలయ్యకు వీరాభిమాని. ఆయన ఆధ్వర్యంలోనే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఉన్నట్టుండి జయనాగేశ్వరరెడ్డి తల్లి స్వర్గస్తులు కావడంతో బాలయ్య సూచన మేరకు ఈ నెల 21కి వేడుక వాయిదా వేసారు.

    Legend 200 Days Function Postponed

    మార్చి 28న రిలీజ్ అయిన బాలయ్య చిత్రం మంచి విజయం సాధించింది. బాలయ్య నట విశ్వరూపం, బోయపాటి దర్శకత్వ ప్రతిభ, జగపతి బాబు విలనిజం వెరసి లెజెండ్‌ని లెజెండరీ హిట్ గా నిలిపాయి. దేవిశ్రీ ప్రసాద్ తొలిసారిగా బాలయ్య చిత్రానికి సంగీతం అందించిన ఈ లెజెండ్ మ్యూజికల్ హిట్ గా నిలవడమే కాకుండా రీ రికార్డింగ్ ని కూడా అద్భుతంగా ఇచ్చాడు దేవి. లెజెండ్ విజయంపై బాలయ్య అభిమానులు హ్యాపీగా ఉన్నారు.

    భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు గోపీచంద్ ఆచంట రామ్ ఆచంట,అనిల్ సుంకర. శాటిలైట్ రైట్స్, థియేట్రికల్ష్ రైట్స్ కలుపుకుని ఈ చిత్రం నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చి పెట్టింది. ఈ చిత్రంలో బాలయ్య సరసన రాధిక ఆప్టే, సోనాల్ చౌహన్ నటించారు. 'లెజెండ్' చిత్రం 31 సెంటర్లలో 100 రోజుల వేడుక జరుపుకున్న సంగతి తెలిసిందే.

    English summary
    The much awaited 200 days celebration event of Nandamuri Balakrishna’s Legend movie is now postponed.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X