బోయపాటి ఇంట్లో, ఫ్యామిలీతో బాలకృష్ణ(ఫొటోలు)
హైదరాబాద్: బాలకృష్ణ హీరోగా నటించిన లెజెండ్ సినిమా విజయాన్ని పురస్కరించుకుని ఆ చిత్ర బృందం చేపట్టిన 'సింహ యాత్ర' గుంటూరు జిల్లా పెదకాకాని చేరినప్పుడు పోటోలు ఇవి. పెదకాకాని ..బోయపాటి శ్రీను సొంత ఊరు. అక్కడ బాలకృష్ణ ఆయన ఇంటికి వెళ్లి బోయపాటి కుటుంబ సభ్యులను కలిసారు.
ఈ సందర్భంగా బాలకృష్ణను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు. ఆయన వెంట చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను తదితరులు ఉన్నారు. బాలికృష్ణను ..బోయపాటి ఇంట్లో సాదరంగా ఆహ్వానించారు. బాలకృష్ణ చాలా ఆప్యాయంగా వారిని పలకరించారు.
బోయపాటి ఇంట్లో బాలయ్య ఫోటోలు స్లైడ్ షోలో...

ఉయ్యాలపై...
బోయపాటి శ్రీను తల్లితో కలిసి బాలకృష్ణ ఇలా ముచ్చటిస్తూ కూర్చున్నారు. ఆయన ఆ ఇంటికి రావటం వారందరిని ఆనందసాగరంలో ముంచెత్తింది.

కూర్చోబెడుతూ...
బాలకృష్ణకు తన తండ్రిగారిలాగానే పెద్దలంటే గౌరవం..ఆయన తను కూర్చోకుండా మెదట..బోయపాటి తల్లిని కూర్చోమని ఇలా కూర్చోబెడుతున్నారు.

ఊరంతా...
పెదకాకానిలో బాలయ్య అభిమానులు అధికం. దాంతో బాలకృష్ణ అక్కడికి రావటంతో పండగ వాతావరణం ఏర్పడింది. ఆయన్ని ఇలా అభిమానులు చుట్టుముట్టి ఊరేగింపుగా తరలివచ్చారు.

ఇంట్లో భోం చేస్తూ..
బాలకృష్ణ, నిర్మాత అనీల్ సుంకర ఇలా బోయపాటి ఇంట్లో భోజనం చేసి మరీ కదిలారు. భోజన సమయంలోనూ ఆఅభిమానులు అక్కడి నుంచి కదలలేదు.

పరిచయాలు
బాలకృష్ణను తన కుటుంబంలో అందరికీ బోయపాటి పరిచయం చేసారు. వారంతా బాలకృష్ణ రాకకు చాలా సంతోష పడ్డారు.

పూలతో...
బాలకృష్ణ అభిమానుల్లో చాలా మంది ఆయన్ని దేముడిలా కొలిచేవారున్నారు. అలాంటి అభిమానులు ఆయనకి పూలతో స్వాగతం ఇలా పలికారు.


Click it and Unblock the Notifications











