బాలయ్య ‘లెజెండ్’ బైక్, ఎస్‌యూవీ అమ్మకానికి..!
హైదరాబాద్: బాలయ్య నటించిన ‘లెజెండ్' చిత్రంలోని బైక్, ఎస్‌యూవి దక్కించుకోవడానికి ఎదరు చూస్తున్న అభిమానులకు శుభవార్త. లెజెండ్ సినిమాలో వాడిన హార్లే డేవిడ్సన్ బైక్, టాటా సఫారీ ఎస్‌యూవీలను అమ్మకానికి పెట్టినట్లు ఆ చిత్ర నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం తన అఫీషియల్ వెబ్ సైట్లో వెల్లడించింది. ఇందుకోసం చంద్ర అనే వ్యక్తిని 9505899399 నెంబర్ ద్వారా సంప్రదించాలని పేర్కొంది. అయితే ప్రస్తుతానికి ఈ ఫోన్ నెంబర్ స్విచాఫ్ వస్తోంది. మరి వీటిని ఎంత మొత్తానికి అమ్మకానికి పెట్టారు అనేది తెలియాల్సి ఉంది.
నందమూరి బాలకృష్ణ నటించిన ‘లెజెండ్' చిత్రం భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 31 సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెలలోనే 175 డేస్ మార్కును అందుకుంది. బాలయ్య నట విశ్వరూపం, బోయపాటి దర్శకత్వ ప్రతిభ, జగపతి బాబు విలనిజం వెరసి లెజెండ్‌ని లెజెండరీ హిట్ గా నిలిపాయి. దేవిశ్రీ ప్రసాద్ తొలిసారిగా బాలయ్య చిత్రానికి సంగీతం అందించిన ఈ లెజెండ్ మ్యూజికల్ హిట్ గా నిలవడమే కాకుండా రీ రికార్డింగ్ ని కూడా అద్భుతంగా ఇచ్చాడు దేవి. లెజెండ్ విజయంపై బాలయ్య అభిమానులు హ్యాపీగా ఉన్నారు.

భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు గోపీచంద్ ఆచంట రామ్ ఆచంట,అనిల్ సుంకర. శాటిలైట్ రైట్స్, థియేట్రికల్ష్ రైట్స్ కలుపుకుని ఈ చిత్రం నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చి పెట్టింది. ఈ చిత్రంలో బాలయ్య సరసన రాధిక ఆప్టే, సోనాల్ చౌహన్ నటించారు.


Click it and Unblock the Notifications











