రేపు బాలయ్య గెలిస్తే డబుల్, ఓడితే సింగిల్...అదీ లెక్క!
హైదరాబాద్: నందమూరి బాలయ్య తొలిసారిగా ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసిన సంగతి తెలిసిందే. రేపు (మే 16) ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. బాలయ్య గెలుపు పట్ల అభిమానులు, తెలుగుదేశం పార్టీ వర్గాల ధీమాతో ఉన్నాయి.
రేపు మరో విశేషం కూడా ఉంది. బాలయ్య నటించిన 'లెజెండ్' చిత్రం రేపటితో 50 రోజులు పూర్తి చేసుకోబోతోంది. మొత్తం 127 సెంటర్లలో సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. రేపు బాలయ్య గెలిస్తే ఆ సంబరాలతో పాటు 'లెజెండ్' మూవీ 50 రోజుల సంబరాలు కూడా నిర్వహించనున్నారు అభిమానులు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా....50 రోజుల వేడుక జరిపేందుకు ఏర్పాట్లు చేసారు.

మార్చి 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన 'లెజెండ్' నందమూరి అభిమానులతో పాటు యావత్ సినీ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుని ఘన విజయం సొంతం చేసుకుంది. బాలయ్య కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా 'లెజెండ్' చిత్రం రికార్డు సృష్టించింది.
నందమూరి నటసింహం బాలకృష్ణ అభినయం, ఆయన పలికిన సంభాషణలు, బోయపాటి శ్రీను దర్శకత్వ ప్రతిభ, వారాహి చలన చిత్రం మరియు 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థల నిర్మాణ విలువలు, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రం సాధిస్తున్న సంచలన విజయంలో కీలక పాత్ర పోషించాయి.


Click it and Unblock the Notifications











