twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణ 'లెజెండ్‌' విడుదల తేదీ ఖరారు

    By Srikanya
    |

    'Legend' confirmed for March 28
    హైదరాబాద్‌: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న నూతన చిత్రం 'లెజెండ్‌'. వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పిస్తున్న ఈ సినిమాను 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 28న విడుదల చేయటానికి దర్శక,నిర్మాతలు నిర్ణయించారు. ఈ విషయాన్ని నిర్మాతలు ఖరారు చేసారు. ఇంతకు ముందు ఈ చిత్రాన్ని పిభ్రవరి లో అనుకున్నారు. కానీ ఇప్పుడిలా తేది మార్చి ఫిక్స్ చేసారు.

    'సింహ' కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలున్నాయి. జగపతిబాబు ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నారు. రాధికా ఆప్టే, సొనాల్‌ చౌహాన్‌ హీరోయిన్స్. దేవీశ్రీప్రసాద్‌ తొలిసారి బాలకృష్ణ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. నూతన సంవత్సర కానుకగా చిత్ర యూనిట్‌ లెజెండ్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది.

    అలాగే నందమూరి బాలకృష్ణ సినిమాలు అంటే సింహాచలంలో చిత్రీకరణ పక్కాగా ఉంటుందనేది ఆయన సినిమాలు చూస్తే ఎవరైనా చెప్పేస్తారు. అంతటి అనుబంధముంది ఆయన సినిమాలకు ఆ ప్రాంతానికి. ఇప్పుడు 'లెజెండ్‌' చిత్రీకరణ కూడా ఇటీవల ఇదే ప్రాంతంలో జరిపారు. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని హైదరాబాద్‌లో ఓ సెట్‌గా రూపొందించారు. అక్కడ చిత్ర ప్రధాన తారగణంపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు.

    నిర్మాతలు మాట్లాడుతూ.... ''బాలకృష్ణను శక్తివంతమైన నాయకుడిగా చూపించబోతున్నాం. సామాజిక అంశాలపై ఆయన సంధించే ప్రశ్నలు సమాజంలో చైతన్యం కలిగించేలా ఉంటాయి. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన వస్తోంది. సినిమా కూడా ఇదే స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటుంది''అని చెబుతున్నారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూర్చుతున్నారు.

    English summary
    Balakrishna starer Legend has reserved its released date. The film will come to theaters on the 28th of March. The film presently being shot and the makers of the film are delighted the way this film is shaping up. Earlier there was news that the film might release during the end of February. But now the team has confirmed that the film will be released on 28th of March.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X