మార్కెట్లోకి ‘లెజెండ్’ అభిమానుల కిట్
హైదరాబాద్: స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్నాయంటే...ఆ సినిమా లోగోలతో కూడిన టీ షర్టులు, టోపీలు, కీచెయిన్లు మార్కెట్లోకి విడుదల చేసి సినిమాకు ప్రచారం కల్పించడం ఈ మధ్య కొత్తగా మొదలైన ట్రెండ్. తాజాగా నందమూరి బాలకృష్ణ 'లెజెండ్' విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అభిమానుల కిట్లు మార్కెట్లోకి విడుదల చేసారు. టీషర్టులతో కూడిన ఈ కిట్లు అన్ని 'కళా మందిర్' స్టోర్లలో లభిస్తున్నాయి. ఒక్కో కిట్ ధర రూ. 300. లార్జ్(L), ఎక్స్‌ట్రా లార్జ్(XL) సైజుల్లో టీషర్టులు అందుబాటలో ఉన్నాయి.
సింహా తర్వాత బాలకృష్ణ హీరోగా బాయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'లెజెండ్'. ఇటీవల ఆడియో వేడుక జరుపుకున్న ఈచిత్రం ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతానికి మంచి స్పందన వస్తోంది.

14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్, వారాహి చలన చిత్రం సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రానికి రామ్ ఆచంట, అనిల్ సుంకర, గోపీచంద్ ఆచంట, సాయి కొర్రపాటి నిర్మాతలు. జగపతి బాబు ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల విడుదలై ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా బాలకృష్ణ లుక్, పెర్ఫార్మెన్స్ సినిమాకు హైలెట్ కానున్నాయి.


Click it and Unblock the Notifications











