'లెజెండ్' ఫస్ట్‌లుక్ గురించి బోయపాటి శ్రీను
హైదరాబాద్ : బాలకృష్ణ అభిమానులు అంతా ఎదురుచూస్తున్న చిత్రం 'లెజెండ్' . ఈ చిత్రం ఫస్ట్ లుక్ గురించి బోయపాటి శ్రీను మీడియాతో మాట్లాడారు. కొత్త సంవత్సరంలో లెజండ్ లుక్ తో రావటం తనకు ఎంతో ఆనందం కలిగిస్తోందంటున్నాడు. ఈ చిత్రం తనకు ఘన విజయం తెచ్చి పెడుతుందనే నమ్మంగా ఉన్నాడు.
బోయపాటి శ్రీను మాట్లాడుతూ.... ''నాకైతే జనవరి 1.. చాలా స్పెషల్. 'లెజెండ్' ఫస్ట్‌లుక్ ఆ రోజు చూపిస్తున్నా. సినిమా కూడా సిద్ధమైపోతోంది. బాలయ్యతో రెండో సినిమా చేయడం ఈ యేడాది స్పెషల్. సింహా తరవాత వస్తున్న కాంబినేషన్ కాబట్టి అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో తెలుసు. అందుకు తగ్గట్లుగా సినిమా రూపొందిస్తున్నాం. 'లెజెండ్' విడుదలైన రోజు బాలకృష్ణ అభిమానులకే కాదు.. నాకూ పండగే. కొత్త యేడాది అందరికీ బాగుండాలని కోరుకొంటున్నా'' అన్నారు.
చిత్రంలో నెగటివ్ రోల్ వేస్తున్న జగపతి బాబు మాట్లాడుతూ... ''ఈ యేడాది నాకు చాలా స్పెషల్. బాలకృష్ణ సినిమాలో ప్రతినాయక పాత్రలో ఆకట్టుకుంటా. నా కెరీర్‌కిది కీలక మలుపు. కథానాయకుడిగా రాణించా. ఇప్పుడు విలన్‌గానూ మెప్పిస్తా అనే నమ్మకం ఉంది. సరికొత్త ఆశలతో 2014లో అడుగుపెడుతున్నా. మీతో పాటు నాకూ ఆల్‌ది బెస్ట్'' అన్నారు.


Click it and Unblock the Notifications












