ఆల్ టైం లెజెండ్రీ హిట్, రూ.50 కోట్ల క్లబ్‌లో..!
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కాంబినేషన్లో రూపొందించిన 'లెజెండ్' చిత్రం శుక్రవారం విడుదలై మాస్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా విశేషంగా ఆకట్టుకుంటూ విజయపథంలో దూసుకుపోతోంది. బాలకృష్ణ పెర్ఫార్మెన్స్, ఫైట్స్, సెంటిమెంట్ సీన్స్, డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి.
బాలకృష్ణ కెరీర్లోనే కాకుండా తెలుగు సినిమా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఫస్ట్ డే రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లు సాధించిన చిత్రం 'లెజెండ్'. బాలయ్య కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించి చిత్రంగానే కాకుండా...నందమూరి వంశంలో '50 కోట్ల క్లబ్'లో చేరబోయే తొలి చిత్రంగా 'లెజెండ్' నిలవనుందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నట్లు నిర్మాతలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

వారాహి చలన చిత్రం, 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ నిర్మాణ సంస్థలకు 'లెజెండ్' చిత్రం మరో భారీ హిట్‌ను అందించింది. అలాగే దర్శకుడు బోయపాటి శ్రీనుపై పరిశ్రమ వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కేవలం ఆంధ్ర-తెలంగాణ ప్రాంతాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ 'లెజెండ్' విజయఢంకా మ్రోగిస్తోందని నిర్మాతలు తెలిపారు.
బోయపాటి సినిమాల్లో పేలే పంచ్ డైలాగులు...ఈచిత్రంలో మరోసారి బాగా పేలాయి. ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ మరో హైలెట్. ఈ సినిమాలో జగపతి బాబు తొలిసారిగా విలన్ పాత్రలో కనిపించాడు. ఇందులో జగపతి బాలయ్య హీరోయిజానికి ధీటుగా క్రూరమైన విలనిజాన్ని పండించారు. బాలయ్య సరసన సోనాల చౌహాన్, రాధిక ఆప్టే హీరోయిన్లుగా నటించారు.


Click it and Unblock the Notifications











