"లెజెండ్'' : విజయోత్సవ యాత్ర ...షెడ్యూల్ డిటేల్స్
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో రూపొందిన "లెజెండ్'' చిత్రం శుక్రవారం విడుదలై మాస్ తో పాటు క్లాస్ ఫ్యామిలీ అడియెన్స్ ను కూడా ఆకట్టు కుంటూ ముందుకు దూసుకు పోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రం యూనిట్ 'సింహా యాత్ర' పేరుతో సక్సెస్ టూర్ ని ప్లాన్ చేసారు. ఆ యాత్ర ఈ రోజు(ఏప్రియల్ 1)ని ప్రారంభం కానుంది.

ఆ యాత్ర ఇలా కొనసాగుతుంది.
ఏప్రియల్ 1
7 AM- సింహాచలం గుడి
11 AM- రాజమండ్రి థియోటర్
4 PM- ఏలూరు థియోటర్
8 PM- విజయవాడ థియోటర్
ఏప్రియల్ 2
5.30 AM- కనకదుర్గ గుడి
7 AM- మంగళగిరి గుడి
8 AM- పెద కాకాని గుడి
11.30 AM-ఒంగోలు థియోటర్
3 PM-నెల్లూరు థియోటర్
7 PM- తిరుపతి థియోటర్
ఏప్రియల్ 3
10.30 AM- కడప దర్గా, థియోటర్స్
12 మధ్యాహ్నం- అహోబిలం గుడి
5 PM- కర్నూలు థియోటర్
ఇక బాలకృష్ణ నటన, ఫైట్స్, సెంటిమెంట్ సీన్స్,సంభాషణలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. బాలకృష్ణ కెరీర్ లోనే కాకుండా తెలుగు సినిమా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఫస్ట్ డే రికార్డింగ్ బ్రేకింగ్ కలెక్షన్స్ సాధించిన చిత్రం "లెజెండ్'' బాలయ్య కెరీర్ లోనే అత్యధిక వసూళ్ళ సాధించిన చిత్రంగానే కాకుండా నందమూరి వంశంలో 50 కోట్ల క్లబ్ లో చేరబోయే తొలి చిత్రంగా లెజెండ్ నిలవనుందని ట్రేడ్ ప్రతినిధులు చెపుతున్నట్టు నిర్మాతలు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
వారాహి చలన చిత్రం, 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ నిర్మాణ సంస్థలకు "లెజెండ్'' చిత్రం మరో భారీ హిట్ ను అందించింది. అలాగే దర్శకుడు బోయపాటి శ్రీనుపై పరిశ్రమ వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కేవలం ఆంధ్ర-తెలంగాణా ప్రాంతాల్లో నే కాకుండా ఓవర్ సీస్ లోనూ "లెజెండ్'' చిత్రం విజయఢంకా మ్రోగిస్తోందని వారు తెలిపారు.


Click it and Unblock the Notifications











