'లెజెండ్' ఎమోషనల్ ట్రైలర్ (లింక్)
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కిన చిత్రం 'లెజెండ్'. వీరిద్దరి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన 'సింహా' చిత్రం ఘనవిజయం సాధించడంతో లెజెండ్‌పై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ , వారాహి చలనచిత్రం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సోనాల్ చౌహాన్, రాధికా ఆప్టే కథానాయికలు. బాలకృష్ణ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ తొలిసారి సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ సందర్భంగా లెజెండ్ తాజా ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు.

అందులోని ఈ డైలాగు అందరినీ ఆకట్టుకుంటోంది...
"నిన్ను కనడానికి అమ్మ కావాలి, కొనడానికి
భార్య కావాలి, నిన్ను నడిపించడానికో
అక్క కావాలి, తిరగడానికి గర్ల్ ఫ్రెండ్
కావాలి..... కానీ కడుపున పుట్టడానికి
మాత్రం కూతురు ఒద్దు"
తన దారికి ఎవ్వరూ అడ్డు రాకూడదు. వేరొకరి దారికి అతను అడ్డుగా వచ్చే పరిస్థితి తెచ్చుకోకూడదు. ఎదుటివారి పవర్ అయినా... పొగరైనా ఆయన అడుగుపెట్టేవరకే. ఒక్కసారి రంగంలోకి దిగాడంటే... చరిత్ర అంతా మారిపోతుంది. ఇంతకీ అతనెవరో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు బోయపాటి శ్రీను.
నిర్మాతలు మాట్లాడుతూ ''బాలకృష్ణ విజృంభణకు అద్దంపట్టే మరో చిత్రమిది. ఎదురులేని మనిషిగా ఆయన అభినయం ఆకట్టుకుంటుంది. ఇటీవల విడుదలైన పాటలకు చక్కటి స్పందన లభించింది. త్వరలోనే చిత్రాన్ని సెన్సార్‌కి పంపుతున్నాం'' అన్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. \
'సింహా'కి రెండోవైపు కూడా చూపించి అభిమానుల్ని మురిపిద్దామనుకొంటున్నారు. అందుకే 'లెజెండ్' చిత్రానికి ఆయన 'లయన్ ఈజ్ బ్యాక్' అనే ఉపశీర్షిక పెట్టారు. మరోసారి విందు భోజనం వడ్డించే పనిలో ఉన్నారు. ఈ చిత్రానికి సంభందించి కొత్త పోస్టర్స్ ని విడుదల చేసి క్రేజ్ ని తారా స్ధాయికి తీసుకువెళ్తున్నారు.
'సింహా' కాంబినేషన్ అంటేనే అంచనాలు తీవ్రస్థాయిలో ఉంటాయి. దానికి తోడు టైటిల్ ఇట్టే ఆకర్షించేస్తోంది. 'లెజెండ్.. బాలయ్యబాబుకి సరిగ్గా సరిపోయే టైటిల్..' అని అభిమానులు ముచ్చటపడిపోతున్నారు. ఫస్ట్‌లుక్‌లో బాలయ్య అదరగొట్టాడు. మీసం, రాజసం, స్త్టెల్ ఇవన్నీ ఫ్యాన్స్‌కి బాగా నచ్చాయి. ఇక తెరపై తమ హీరో ఎలా ఉంటాడో..? అని వూహల్లోనే 'లెజెండ్' విశ్వరూపాన్ని దర్శించుకొంటున్నారు.
<center><iframe width="100%" height="315" src="//www.youtube.com/embed/XMW0DrjGaxQ" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications











