‘లెజెండ్’ మూవీలో బాలకృష్ణ డైలాగులు లీక్

యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం దుబాయ్ లో శరవేగంగా జరుగుతోంది. దుబాయ్ లో ఈనెల 22 వరకూ షూటింగ్ జరుపుకొని తర్వాత ఇండియాకు తిరిగిరానుందని తెలుస్తోంది. ఆడియోని మార్చి 7 న విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు ఫిక్స్ అయినట్లు సమాచారం. ఫస్ట్ టీజర్ ని కూడా అతి త్వరలో లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 28న గానీ, లేదంటే ఏప్రిల్ 4న గానీ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.
రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్‌సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందిస్తున్నారు. వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈచిత్రంలో బాలయ్య సరసన రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జగపతి బాబు విలన్ పాత్ర పోషిస్తున్నారు.
మరో వైపు ఈ చిత్రం బడ్జెట్ ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. దాదాపు నలభై కోట్ల వరకూ ఈ చిత్రంపై పెట్టుబడి పెడుతున్నట్లు సినీ వర్గాల సమాచారం. అయితే వరస ఫ్లాపుల్లో ఉన్న బాలకృష్ణపై ఈ రేంజి బడ్జెట్ ఎంత వరకూ వర్కవుట్ అవుతుందనేది ట్రేడ్ సర్కిల్‌లో చర్చనీయాంశం అయింది.


Click it and Unblock the Notifications











