»   » బాలయ్య ‘లెజెండ్’ మరో రికార్డ్ (పోస్టర్)

బాలయ్య ‘లెజెండ్’ మరో రికార్డ్ (పోస్టర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి నటసింహం బాలకృష్ణ నట విశ్వరూపాన్ని మరోసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసి పలు రికార్డులను తిరగరాసిన చిత్రం ‘లెజెండ్‌'. వారాహి చలనచిత్రం సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ చిత్రం మార్చి 28న విడుదలై సూపర్ హిట్ అయింది. తాజాగా ఈ చిత్రం ప్రొద్దుటూరులోని అర్చన థియేటర్ లో 525వ రోజు పూర్తి చేసుకుంది. ఇక్కడ విజయవంతంగా 75 వారాలు ప్రదర్శితం అయింది. ఇది సెకండ్ ప్లాటినమ్ జూబ్లీ.

సెప్టెంబర్ 6న నందమూరి బాలయ్య నటవారసుడు మోక్షజ్ఞ జన్మదిన వేడుకలు, లెజెండ్ చిత్రం సెకండ్ ప్లాటినమ్ జూబ్లీ వేడుకలు కడప జిల్లా అభిమానులు, అర్చర థియేటర్, ప్రొద్దుటూరు వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు గ్రాండ్ గా ఏర్పాట్లు చేస్తున్నారు.


Legend Movie 525 days

‘సింహా' వంటి సూపర్‌ సక్సెస్‌ అనంతరం మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటించిన ‘లెజెండ్‌' చిత్రం, ‘సింహా' రికార్డులను తిరగ రాయడంతోపాటు.. బాలకృష్ణ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. భారీ బడ్టెట్‌తో తెరకెక్కిన ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. మ్యూజిక్‌ మిస్సైల్‌ దేవిశ్రీప్రసాద్‌ బాణీలు, హీరోయిన్లు సొనల్‌ చౌహాన్‌ అందం, రాధికా ఆప్టే అభినయంతోపాటు.. ఫ్యామిలీ హీరో టర్న్‌డ్‌ విలన్‌ జగపతిబాబు ప్రతినాయకుడిగా ప్రదర్శించిన విలనిజం ‘లెజెండ్‌' చిత్రానికి మెయిన్‌ హైలైట్‌గా నిలిచింది.


వీటన్నిటికంటే ముఖ్యంగా...బాలకృష్ణ పాత్ర తీరుతెన్నుల్ని దర్శకుడు బోయపాటి తీర్చిదిద్దిన విధానం ధియేటర్‌లో ఆడియన్స్‌ చేత విజిల్స్‌ వేయించింది. అలాగే.. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడకుండా చిత్ర నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపి ఆచంట, అనిల్‌ సుంకర మరియు సమర్పకులు సాయి కొర్రపాటి పాటించిన నిర్మాణ విలువలు ‘లెజెండ్‌' చిత్ర విజయంలో కీలకపాత్ర పోషించాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

English summary
Legend, Nandamuri Balakrishna yet again proved his greatness as Lion Of Telugu Cinema and Golden star by completing platinum Jubilee of Legend Movie.
Please Wait while comments are loading...