డప్పు కొడుతూ బాలయ్య (లెజెండ్ న్యూ పోస్టర్ కేక)
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోతున్న 'లెజెండ్' చిత్రం విడుదలకు ముందు నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా విడుదలైన ఈచిత్రం టీజర్, ఫస్ట్ లుక్ ఫోటోలు సినిమాపై అంచనాలు పెంచాయి. ఇపుడు 'లెజెండ్' చిత్రానికి సంబంధించిన మరో పోస్టర్ విడుదలైంది. ఇందులో బాలకృష్ణ డోలు వాయిస్తూ...కేక పుట్టించే లుక్‌లో దర్శనమిచ్చాడు.
14రీల్స్ , వారాహి చలన చిత్రం పతాకం సంయుక్త సమర్పణలో బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'లెజెండ్'. ఈ చిత్రం ఆడియో మార్చి 7న విడుదల కానుంది. ఈ సినిమాలో బాలకృష్ణ గెటప్ ఇప్పుడు అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన రాధిక ఆప్టే, సొనాల్ చౌహాన్ నాయికలు.
దేవిశ్రీ ప్రసాద్ ఆడియో అందించారు. ఈ చిత్రం ఆడియో రైట్స్ ని భారీ మొత్తానికి లహరి సంస్ధ కొనుగోలు చేసింది. అయితే ఎంత మొత్తం ఈ ఆడియోపై వెచ్చించారనే విషయం తెలియరాలేదు. అలాగే కొత్త స్టిల్ ను మహాశివరాత్రి సందర్బంగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. లయిన్ ఈజ్ బ్యాక్ అంటూ ఉన్న ఈ పోస్టర్ అభిమానులను ఓ రేంజిలో అలరిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామ్‌ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మార్చి 28న విడుదలకు సిద్దం చేస్తున్నారు.
నిర్మాత మాట్లాడుతూ... ''శక్తివంతమైన నాయకుడికి ప్రతిరూపంగా బాలకృష్ణ ఇందులో కనిపిస్తారు. ప్రస్తుత సమాజ స్థితిగతుల్ని సునిశితంగా పరిశీలించి దర్శకుడు ఈ కథని సిద్ధం చేసుకున్నారు. బాలకృష్ణను 'సింహా'గా చూపించిన బోయపాటి మరోసారి ఆ స్థాయిలో చూపించబోతున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కి చక్కటి స్పందన వస్తోంది''అన్నారు.


Click it and Unblock the Notifications












