‘లెజెండ్’ మూవీ పబ్లిక్ టాక్ ఎలా ఉంది?
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ నటించిన 'లెజెండ్' మూవీ ఈ రోజు గ్రాండ్‌గా విడుదలైంది. ఉదయం షో నుండే సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా చూసిన వారంతా అద్భుతంగా ఉందని ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర మంతా సూపర్ హిట్ టాక్ స్ర్పెడ్ అయింది. 'సింహా' తర్వాత బాలయ్య-బోయపాటి కాంబినేషన్లో ఈ చిత్రాన్ని మరో పెద్ద హిట్ చిత్రంగా చెప్పుకోవచ్చు.
సినిమా పబ్లిక్ టాక్ అద్భుతంగా ఉండటంతో కలెక్షన్ల పరంగా బాక్సాఫీసు వద్ద మంచి బిజినెస్ చేస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ పరంగా 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్, వారాహి చలన చిత్రం సంస్థలకు గొప్ప నెట్వర్క్ ఉండటంతో తొలిరోజు ఈచిత్రాన్ని భారీగా రిలీజ్ చేసారు. ఈ నేపథ్యంలో కలెక్షన్ల పంట పండటం ఖామని అంటున్నారు.

బాలయ్య పవర్ ఫుల్ పుర్ఫార్మెన్స్‌తో పాటు డాన్సుల్లోనూ అదరగొట్టాడని అభిమానులు అంటున్నారు. ఇక బాలయ్యతో జోడీ కట్టిన రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ గ్లామర్ పరంగా అభిమానులకు కనువిందు చేసారు. ఇక జగపతి బాబు విలనిజం సినిమాకు మరో హైలెట్‌గా నిలిచిందని అంటున్నారు.
స్టోరీ విషయానికొస్తే.....జయ్‌దేవ్ (బాలకృష్ణ) వ్యక్తిత్వపరంగా నియంతలాంటివాడు. నియంత అంటే ఎప్పుడూ అధికారం గురించి ఆలోచిస్తాడు. కానీ జయ్‌దేవ్ మాత్రం ప్రజల కోసం ఆలోచిస్తాడు. సమాజం తరవాతే ఏదైనా. తనను నమ్ముకొన్నవాళ్లకు అన్యాయం జరిగితే సహించడు. దీంతో పాటు కుటుంబం అంటే ప్రాణం. తన క్రమశిక్షణ వల్ల ఏం సాధించాడు? ఏం కోల్పోయాడు? అసలు ఈ ప్రయాణంలో లెజెండ్‌గా ఎలా ఎదిగాడు? అన్నదే ఈ చిత్రకథ. జితేందర్ (జగపతిబాబు)తో ఆయనకున్న పగ ఏమిటన్నదీ ఆసక్తికరం.


Click it and Unblock the Notifications











