బాలయ్య తిట్టడంతో నా ఫ్యాన్స్ ఫీలయ్యారు : జగపతి

ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.....'లెజెండ్ సినిమా బాగుందని, అన్ని రుచుల సమ్మేళనమని అభిమానులు ఫోన్లు చేసి చెబుతున్నారు. సినిమా విజయంతో మాకు రెండు రోజుల ముందే ఉగాది పండగ మొదలైనట్లు ఉంది అని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. సినిమా కోసం ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి పని చేసారని బాలకృష్ణ చెప్పుకొచ్చారు.
జగపతి బాబు మాట్లాడుతూ....'తొలుత ఈ పాత్ర ఒప్పుకోవడానికి కాస్త ఆలోచించాను. కానీ ఈ చిత్రం చూసిన తర్వాత చాలా మంది ఫోన్లు చేసి పెర్ఫార్మెన్స్ బాగుందని మెచ్చుకుంటున్నారు. విలన్ పాత్రల వల్ల ఇన్నాళ్లు ఉన్న లేడీస్ ఫాలోయింగ్ పోతుందనుకున్నా. కానీ అలాంటిదేమీ జరుగకపోగా రెట్టింపయింది. అయితే సినిమాలో బాలయ్య బాబు నన్ను 'నా కొడకా' అని తిట్టడంతో అభిమానులు కొందరు ఫీలయ్యారు' అని జగపతి బాబు తెలిపారు.
కాగా....ఈ నెల 28న విడుదలైన 'లెజెండ్' చిత్రం విడుదలైన అన్ని చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకెలుతోంది. తొలి రోజు ఈ చిత్రం రూ. 7 కోట్లకు పైగా వసూలే చేసింది. బాలయ్య కెరీర్లోనే ఈ చిత్రం అత్యధిక వసూళ్లు సాధించబోయే చిత్రంగా నిలవబోతోందని, 50 కోట్ల మార్కను త్వరలోనే అందుకుంటుందని నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











