'లెజండ్ ' నిర్మాత చేతికి లక్ష్మి ప్రసన్న సినిమా రైట్స్

By Srikanya

హైదరాబాద్ : లక్ష్మి ప్రసన్న కీలకపాత్రలో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వర్కింగ్ డ్రీమ్ ప్రొడక్షన్ పతాకంపై చాణక్య బూనేటి నిర్మిస్తున్న చిత్రం 'చందమామ కథలు'. ఈ చిత్రం చూసి నచ్చిన 'లెజండ్ ' నిర్మాత అనీల్ సుంకర రైట్స్ తీసుకున్నారని సమాచారం. ఆయన సమర్పించి ప్రేక్షకులు ముందుకు తీసుకురావటానికి నిర్ణయించుకున్నారు. ఎటివి బ్యానర్ పై ఈ చిత్రం ప్రెజెంట్ చేస్తున్నట్లు విడుదల అవుతుంది. ఏప్రియల్ 25 న చిత్రం విడుదల అవుతోంది.

లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ.... ఈ సినిమా విడుదలైనాక 'ఇది తెలుగు సినిమా' అని అందరూ గర్వంగా చెప్పుకుంటారన్నారు. ఎనిమిది కథల సమాహారమైన ఈ చిత్రంలోని ప్రతి కథా హృదయాన్ని స్పృశిస్తుందని తెలిపారు. టైటిల్ దగ్గర్నుంచీ ఈ సినిమాకి సంబంధించిన ప్రతి విషయమూ తనకు నచ్చిందని, ఇది అందమైన వినోదాత్మక చిత్రమనీ నరేశ్ అన్నారు. ప్రవీణ్ ప్రతిభావంతుడైన దర్శకుడనీ, హాలీవుడ్ సినిమాలా ఈ చిత్రం ఉందనీ కృష్ణుడు చెప్పారు.

 'Legend' producer presents 'Chandamama Kathalu'

లక్ష్మీప్రసన్న, నరేశ్, ఆమని, కృష్ణుడు, కిశోర్, చైతన్యకృష్ణ, నాగశౌర్య, అభిజిత్, షామిలి, అమితా రావు, రిచా పనయ్, కృష్ణేశ్వరరావు ప్రధాన పాత్రధారులుగా ఈ చిత్రం వస్తోంది. మిగతా పాత్రల్లో పృథ్వీ, వెన్నెల కిశోర్, నరసింహరాజు, కొండవలస, గుండు సుదర్శన్, సూర్య, దువ్వాసి మోహన్, ఇంటూరి వాసు, గిరిధర్, రాఘవ, కుంతి శ్రీనివాస్, నవీన్ నేని, జూ. రేలంగి, సౌమ్య, స్నిగ్ధ తారాగణమైన ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె. మేయర్, కూర్పు: ధర్మేంద్ర కాకరాల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాఘవేంద్రరెడ్డి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X