తెలంగాణలో ఏ సెంటరైనా ఓకే అంటూ బాలయ్య (ఫోటోలు)
హైదరాబాద్: ఏ సెంటరైనా ఓకే అంటూ తెలంగాణ ప్రాంతంలో నందమూరి నటసింహం బాలయ్య దూసుకెళ్లారు. లెజెండ్ చిత్రం 'సింహ యాత్ర'లో భాగంగా ఆయన నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పర్యటించారు. వరంగల్, ఖమ్మం, కోదాడ, యాదిగిరి గుట్ట తదితర ప్రాంతాల్లో బాలయ్య యాత్ర సాగింది.
బాలయ్య వెళ్లిన ప్రతి చోట అభిమానులు ఆయనకు నీరాజనాలు పట్టారు. ఆయన్ను చూసేందుకు అభిమానులు బారులు తీరారు. లెజెండ్ సినిమాలో బాలయ్య పెర్ఫార్మెన్స్ అదరగొట్టారు...బాలయ్య ఇలాంటి హిట్ చిత్రాలు మరిన్ని తీయాలని అభిమానులు ఆకాక్షించారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ 'లెజెండ్' చిత్రాన్ని ఆదరిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాన ప్రాంతంలో లెజెండ్ సింహ యాత్రకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో......

జనగాంలో...
వరంగల్ జిల్లా జనగాంలో అభిమానులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న బాలయ్య.

ఫ్యాన్స్
తనను చూసేందుకు భారీగా తరలి వచ్చిన అభిమానులకు బస్సులో నుండి అభివాదం చేస్తున్న అభిమానులు.

ఖమ్మం జిల్లాలో...
ఖమ్మం జిల్లాలో బస్సుపై నుండి అభిమానులకు అభివాదం చేస్తున్న బాలయ్య.

భారీగా అభిమానులు
ఖమ్మం జిల్లా పర్యటనలో అభిమానులు బాలకృష్ణకు నీరాజనాలు పట్టారు. అందుకు సంబంధించిన ఫోటోను ఇక్కడ చూడొచ్చు.

ఇలా వినూత్నంగా..
బాలయ్యను చూసేందుకు అభిమానులు ఇలా వినూత్నంగా బుల్డోజర్ పైకి ఎక్కారు.

కోదాడలో..
నల్లకొండ జిల్లా కోదాడలో బాలయ్య ఇలా....

అభిమానులు
నల్లగొండ జిల్లా కోదాడలో బాలయ్యను చూసేందుకు అభిమానులు ఇలా భారీగా తరలి వచ్చారు.

వరంగల్ లో...
వరంగల్‌లోని ఓ దేవాలయాన్ని సందర్శించిన అనంతరం బయటకు వస్తూ బాలయ్య ఇలా....

అభిమానులు...
వరంగల్ లోని థియేటర్ వద్ద బాలయ్యను చూసేందుకు అభిమానులు భారీగా తరలి వచ్చారు.

యాదగిరి గుట్టలో...
యాదిగిరి గుట్ట లక్ష్మి నరసింహ స్వామి దేవాలయాన్ని బాలయ్య దర్శించుకున్నారు.

వెల్లువెత్తిన అభిమానం
యాదగిరి గుట్టలో బాలయ్యపై అభిమానం వెల్ల వెల్లువెత్తింది. అభిమానులు పూలు చల్లుతున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.


Click it and Unblock the Notifications











