డెట్రాయిట్‌లో 'లెజెండ్' ...హంగామా
వాషింగ్టన్ : బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్వకత్వంలో వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రామ్ ఆచంట నిర్మిస్తున్న చిత్రం లెజెండ్. ఈ చిత్రానికి సాయికొర్రపాటి సమర్పకులు. 'లెజెండ్' పాటలు విజయవంతమైన సందర్భంగా ఆయన అభిమానులు డెట్రాయిట్‌లో సినిమా విడుదల మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలకృష్ణ సరసన రాధికా ఆప్టే-సోనాల్ చౌహాన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాలో జగపతిబాబు విలన్ గా నటిస్తున్నాడు.
గురువారం ప్రదర్శించబోయే ప్రీమియర్‌షో ప్రథమ, ద్వితీయ టికెట్లను ప్రవాసాంధ్రులు సతీష్, సుధాకర్‌లు చెరి 1116 డాలర్లకు కైవసం చేసుకున్నారు. లెజెండ్ టీషర్టును నవీన్, క్యాప్‌ను నాదెళ్ల గంగాధర్, జెండాను కోనేరు శ్రీనివాసరావు ఆవిష్కరించారు.

బాలకృష్ణ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ...సినిమా, పాటలు అద్భుతంగా వచ్చాయని, తమ అభిమానులకు ముందస్తుగా ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. దర్శకుడు బోయపాటి సినిమా విజయవంతం కావడానికి కృషిచేస్తున్న ప్రవాసాంధ్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పంత్ర సునీల్, యార్లగడ్డ శివరాం, దుగ్గిరాల కిరణ్, పోలవరపు శివ, పోలవరపు హర్ష తదితరులు నిర్వహించారు.
బాలకృష్ణ కెరియర్ లో అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్నీ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల డి.ఐ వర్క్ పూర్తి చేసుకున్న లెజెండ్ చిత్రాన్ని త్వరలో సెన్సార్ కు పంపనున్నారు.


Click it and Unblock the Notifications











