సుచిత్రాసేన్‌ ఆరోగ్యం విషమం

By Srikanya

Suchitra Sen
కోల్‌కతా: అలనాటి మేటినటి సుచిత్రాసేన్‌....నాటి భజన సంగీత గాయని జ్యుతికారాయ్‌లిద్దరి ఆరోగ్య పరిస్థితి ఏమీ బాగాలేదు. ఇక్కడి వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వీరిద్దరి ఆరోగ్యపరిస్థితీ ఆందోళనకరంగానే ఉన్నట్లు వైద్యవర్గాలు ఆదివారం నాడిక్కడ తెలిపాయి.

గత కొద్దిరోజులుగా ఇక్కడి ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుచిత్రాసేన్‌ ఇంకా వెంటిలేటర్‌మీద ఉన్నారు. ఆమె రక్తంలో ఆక్సిజన్‌ పరిమాణాలూ తగ్గాయి. గుండె, రక్తపోటు పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

సుచిత్రా సేన్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. శ్వాస నాళం ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆమెను వైద్యులు ఐసీయూకి తరలించారు. 82 ఏళ్ల సుచిత్రాసేన్‌ కోల్‌కతాలో ఒంటరిగా నివసిస్తున్నారు. అనారోగ్యం వార్త తెలిసి కుమార్తె మూన్‌మూన్‌సేన్‌, మనవరాలు రైమా సైన్‌ కోల్‌కతా చేరుకున్నారు. క్లాసిక్‌ బెంగాలీ చిత్రాలుగా పేర్కొనే పలు చిత్రాల్లో సుచిత్ర నటించారు. దేవదాసు చిత్రంలో నటనకు ఉత్తమనటి ఆమె. సప్తపది అనే చిత్రానికి గాను మాస్కో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఉత్తమ నటి అవార్డు లభించింది. 2005లో దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డును సుచిత్ర తిరస్కరించారు. కోల్‌కతా ప్రభుత్వం ఆమెను వంగవిభూషణ్‌ అవార్డుతో సత్కరించింది.

ఇక భజనసంగీతంతో ఒకానొకప్పుడు జనాన్ని సమ్మోహనం చేసిన జ్యుతికారాయ్‌ స్వరమాధుర్యానికి ముగ్ధులైన మహాత్మాగాంధీ, జవహరల్‌లాల్‌ నెహ్రూలు ఆమెను ఎంతగానో అభిమానించేవారు. 92 సంవత్సరాల జ్యుతికారాయ్‌కి 1972లో 'పద్మశ్రీ' పురస్కారం లభించింది. తీవ్రమైన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చేరారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X