కె విశ్వనాధ్ మళ్ళీ దర్శకత్వం..
శంకరాభరణం, సాగరసంగమం, సప్తపది, స్వాతిముత్యం వంటి ఎన్నో సంగీత ప్రధాన చిత్రాలు అందించిన ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాద్ మళ్ళీ మెగా ఫోన్ పట్టుకోనున్నారు. స్వరాభిషేకం నిర్మించిన కౌసలేంద్రరావు పట్టుదలతో మరో చిత్రాన్ని తెరకెక్కించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. స్వరాభిషేకం చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటంతో ఆయన పూర్తి గ్యాప్ తీసుకుని నటుడుగా నచ్చిన పాత్రలు చేస్తూ వస్తున్నారు. ఇక మణిశర్మ తొలిసారిగా కె.విశ్వనాధ్ చిత్రానికి స్వరాలు సమకూర్చనున్నారు. అలాగే తారాగణం, సాంకేతిక నిపుణులు ఇంకా ఫైనలైజ్ కాలేదు.
కె విశ్వనాధ్ కమల్ హాసన్ సాగరసంగమం సప్తపది స్వాతిముత్యం స్వరాభిషేకం శంకరాభరణం కౌసలేంద్రరావు k viswanath mani sharma sagara sangamam kamal hassan swathymutyam


Click it and Unblock the Notifications