సోషల్ మీడియాలోకి సిరివెన్నెల రీ ఎంట్రీ.. ఇక అసలు రహస్యాలు బయటపడతాయి!
సోషల్ మీడియా అనేది ఇప్పుడు చాలా మంది జీవితంలో ఒక భాగమైంది. సరదాగా గడపాలన్నా..కొత్త తరహా విషయల గురించి తెలుసుకోవాలని అనుకున్నా.. అలాగే కొత్తగా ఏదైనా చెప్పాలని అనుకున్నా కూడా సోషల్ మీడియానే ప్రధాన ఆయుధంగా మారింది. అలాగే కొన్నిసార్లు సోషల్ మీడియా వివాదాలకు కూడా దారితీస్తుంది. అందుకే సెలబ్రెటీస్ కొంతమంది సోషల్ మిడియాలోకి రావాలంటే భయపడుతున్నారు.
ఇక ఫైనల్ గా మరొక సినీ ప్రముఖులు ట్విట్టర్ ద్వారా అభిమానుల ముందుకు వచ్చారు. పాటల రచయితగా సినిమా ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్న సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంటే ఎన్నో పాటలు గుర్తుకు వస్తాయి. ఇక ఆ పాటలను ఎలా రాసి ఉంటారు, పాట సందర్భం ఏమిటి? అని అనేక ప్రశ్నలు మదిలో మెదులుతు ఉంటాయి. ఇక తన జీవితంలోని పాటల రహస్యాలను బయటపెట్టడానికి ఆయన సిద్ధమయ్యారు.

ట్విట్టర్ లో ఇక నుంచి చురుగ్గా కనిపించనున్నట్లు చెప్పారు. అసలైతే సిరివెన్నెల 2015లోనే ట్విట్టర్ లోకి అడుగుపెట్టారు. మళ్ళీ అప్పుడే దాన్ని వదిలేశారు. ఇక ఐదేళ్ల తరువాత మళ్ళీ అదే అకౌంట్ తో నెటీజన్స్ ని పలకరించబోతున్నారు. గత ఏడాది సిరివెన్నెల పద్మశ్రీ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆయన టాలీవుడ్ లో కొన్ని సినిమాలకు పాటలు అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications