పెద్ద ఎన్టీఆర్ మేకప్‌మేన్...పీతాంబరం మృతి
ప్రముఖ మేకప్‌మేన్, నిర్మాత అయిన ఎమ్.పీతాంబరం(90) సోమవారం (పిబ్రవరి 21, 2011) రాత్రి చెన్నైలో మృతి చెందారు. పెద్ద ఎన్టీఆర్ కి మేకప్ మెన్ గా... శ్రీకృష్ణార్జున విజయం, అగ్గిబరాటా, గుండమ్మ కథ, మిస్సమ్మ, పాతాళభైరవి, లవకుశ తదితర చిత్రాలకు పీతాంబరం పని చేశారు. అలాగే నిర్మాతగా ఎన్టీఆర్‌తో 'అన్నదమ్ముల అనుబంధం', 'యుగంధర్' చిత్రాల్ని నిర్మించారు. తెలుగులో ఎన్టీఆర్, తమిళంలో ఎమ్‌జీఆర్, నంబియార్‌లకు ఆయన వ్యక్తిగత మేకప్‌మేన్‌గా వ్యవహరించారు.అలాగే నందమూరి బాలకృష్ణ దర్శకత్వంలో ప్రారంభమై ఆగిపోయిన 'నర్తనశాల' చిత్రంకు కూడా పీతాంబరంకి మేకప్ బాధ్యతలు అప్పగించారు. అలాగే చంద్రముఖి వంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన ప్రముఖ దర్శకుడు పి.వాసు - పీతాంబరం కుమారుడే.పీతాంబరం మృతికి ధట్స్ తెలుగు నివాళులు అర్పిస్తోంది.
పి వాసు పీతాంబరం ఎన్టీఆర్ గుండమ్మ కథ మిస్సమ్మ పాతాళభైరవి లవకుశ p vasu peethambaram ntr gundamma katha missamma pathala bhairavi lava kusa


Click it and Unblock the Notifications