twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సింగర్ SP బాలసుబ్రహ్మణ్యంకి కరోనా పాజిటివ్.. నన్ను ఎవరు డిస్టర్బ్ చేయవద్దంటూ..

    |

    గాన గంధర్వుడు సీనియర్ గాయకులు ఎస్పీ. బాలసుబ్రహ్మణ్యం కరోనా భారిన పడ్డారు. ఇక రూమర్స్ డోస్ వైరల్ అవ్వకముందే ఈ విషయాన్ని ఆయన ఒక వీడియో ద్వారా అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి కూడా ఆయన తన నివాసంలోనే ఉంటున్నారు. అయితే ఇటీవల సడన్ గా కొంత అస్వస్థతకు గురవ్వడంతో వెంటనే ఆయన ఒక ప్రయివేట్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు.

    Recommended Video

    COVID-19 : SP Balasubrahmanyam Tests Coronavirus Positive || Oneindia Telugu
    జలుబు, చెస్ట్ పెయిన్

    జలుబు, చెస్ట్ పెయిన్

    బాల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. గత రెండు రోజులుగా జలుబు చెస్ట్ పెయిన్ వంటి లక్షణాలు కొంచెం కొంచెంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జ్వరం వస్తోంది పోతోంది. గాయకులకు చెస్ట్ కి సంబంధించిన ఇబ్బంది అనేది అప్పుడప్పుడు కామన్. అయితే జ్వరం కూడా ఇబ్బంది పెడుతోందని వెంటనే కరోనా పరీక్షలు చేయించుకున్నాను.

    ఏ మాత్రం రిస్క్ తీసుకోవద్దని

    ఏ మాత్రం రిస్క్ తీసుకోవద్దని

    కరోనా పరీక్షలు చేసిన తరువత చాలా తక్కువ స్థాయిలో వైరస్ ఉన్నట్లు రిపోర్ట్స్ వచ్చాయి. ఇంటి దగ్గరే ఉండి రెస్ట్ తీసుకొని కాస్త ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుందని వైద్యులు అన్నారు. కానీ నేను ఈ విషయంలో ఏ మాత్రం రిస్క్ తీసుకోవద్దని అనుకున్నాను. అంతే కాకుండా ఇంట్లో వాళ్ళను కూడా ఇబ్బందుల్లో పెట్టకూడదని అనుకున్నాను. అందుకే హాస్పిటల్ లో ఉంటాను అని వైద్యులకు చెప్పాను.

    ఆరోగ్య పరిస్థితి చాలా నిలకడగా ఉంది

    ఆరోగ్య పరిస్థితి చాలా నిలకడగా ఉంది

    ఇక్కడ వైద్యులు కూడా నాకు స్నేహితులు కావడంతో వాళ్ళు నన్ను ఇంకా బాగా చూసుకుంటున్నారు. ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి చాలా నిలకడగా ఉంది. నా శ్రేయోభిలాషులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. కాబట్టి ఎవరు కూడా బయపడవద్దు.

    డిస్టర్బ్ చేయకండి

    డిస్టర్బ్ చేయకండి

    అలాగే నా ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడానికి ఎవరు కూడా నన్ను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయవద్దు. నేను బాగా ఏ ఉన్నాను. కేవలం ఒక జలుబు మాత్రమే ఉంది. కాస్త జ్వరం కూడా ఉంది. అంతకు మించి పెద్దగా ఇబ్బంది లేదు. నేను కొన్ని రోజుల్లోనే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళతాను. చాలా మంది నాకు ఫోన్లు చేస్తున్నారు. నేను సమాధానం ఇవ్వడం లేదు. ఎందుకంటే నేను ఇక్కడికి చికిత్స అందుకొని రెస్ట్ తీసుకోవడానికి వచ్చాను. అందుకే దయచేసి ఎవరు కూడా డిస్టర్బ్ చేయకండి.. అని బాలసుబ్రహ్మణ్యం వివరణ ఇచ్చారు.

    English summary
    Legendary singer S. P. Bala Subramanyam tested Covid19 positive. Wishing speedy recovery. He officially announced this via a video before the rumors went viral. He has been at his residence since the lockdown began. However, he was recently admitted to a private hospital due to sudden illness
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X