లెజండరీ సింగర్ శంషాద్ బేగం కన్నుమూత

వయసు పైబడటంతో బేగం కొన్ని నెలలుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆమె కూతురు ఉషా వెల్లడించారు. 1919 ఏప్రిల్ 14న పంజాబ్ లోని అమృత్ సర్‌లో శంషాద్ బేగం జన్మించారు. లాహోర్ లోని పెషావర్ రేడియోలో డిసెంబర్ 16, 1947న ఆమె సింగర్‌గా కెరీర్ ప్రారంభించారు. తన గానామృతంతో శ్రోతలను అలరించారు.
ఆమె భర్త గణ్‌పత్ లాల్ బట్టో 1955లో మరణించిన తర్వాత ఆమె భారత్‌కు షిప్టయ్యారు. కూతరు ఉషా రాత్రా, అల్లుడితో కలిసి ముంబైలోనే ఉంటున్నారు. ఆమె పాడిన హిట్ పాటల్లో 'కహి పే నషానా', 'భూజ్ మేరా క్యా నామ్ రే', 'సైయాన్ దిల్ మే ఆనారే', 'లేకె పెహ్లా పెహ్లా ప్యార్', 'చూద్ బబుల్ కా ఘర్' లాంటి పాటలు బాగా పాపులర్ అయ్యాయి.


Click it and Unblock the Notifications