SP balasubrahmanyam: గాన గాంధర్వుడు ఎస్పీ బాలు కన్నుమూత.. విషాదంలో సంగీత ప్రపంచం

ఎన్నో దశాబ్దాలుగా తన గాన మాధుర్యంతో సంగీత అభిమానులను ఉర్రూతలూగించిన ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇక లేరు. ఆగస్టు 5 తేదీన కరోనా వ్యాధి బారిన పడిన ఆయన చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గాన గంధర్వుడి మరణంతో సంగీత ప్రపంచం మూగపోయింది. ఆయన మరణంతో తీవ్ర దిగ్బ్రాంతికి గురైన సినీ లోకం ఆయనకు శ్రద్దాంజలి ఘటిస్తూ నివాళులర్పిస్తున్నారు. ఎస్పీ బాలు వ్యక్తిగత జీవితం, ప్రొఫెషనల్ జీవితం గురించి..

మీడియాకు తండ్రి మరణవార్తను స్వయంగా ఎస్పీ చరణ్

మీడియాకు తండ్రి మరణవార్తను స్వయంగా ఎస్పీ చరణ్

గత 50 రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న ఎస్పీ బాలు గురించి ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ట్విట్టర్, ఇన్స్‌టాగ్రామ్‌లో హెల్త్ అప్‌డేట్‌ ఇచ్చేవారు. తాజాగా తన తండ్రి మరణవార్తను మీడియా ముందుకు వచ్చి చెప్పారు. మధ్యాహ్నం 1.04 నిమిషాలకు ఈ లోకాన్ని వీడారని చెప్పడంతో సంగీత ప్రపంచం విషాదంలో మునిగిపోయింది. ఎస్పీ చరణ్ స్నేహితుడు సినీ దర్శకుడు వెంకట్ ప్రభు కూడా ట్విట్టర్‌లో ధృవీకరించారు. ఎంజీఎం హాస్పిటల్ నుంచి చెన్నైలోని ఆయన నివాసానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎస్పీ బాలు జననం

ఎస్పీ బాలు జననం

ఎస్పీ బాలు అసలు పేరు శ్రీ ప‌తి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం. ఎస్పీ బాలసుబ్రమణ్యం 1946 జూన్ 4వ తేదీన నెల్లూరులో పీ సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు జన్మించారు. ఆయనకు ఇద్దరు సోదరులు, నాలుగు చెల్లెలు. అందులో గాయని ఎస్పీ శైలజ, ఎస్పీ వసంత సుపరిచితులు. ఎస్పీ బాలసుబ్రమణ్యం వివాహం సావిత్రితో జరిగింది. ఆయనకు పల్లవి, ఎస్పీ చరణ్ సంతానం ఉన్నారు.

నటుడిగా ఎస్పీ బాలు ప్రస్థానం

నటుడిగా ఎస్పీ బాలు ప్రస్థానం

నటుడిగా 1969లో పెళ్లంటే నూరేళ్ల పంట చిత్రం ద్వారా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత పక్కింటి అమ్మాయి, ప్రేమ, వివాహ భోజనంబు, కళ్లు, చెన్నపట్నం చిన్నోడు, ప్రేమికుడు, గుణ, పవిత్రబంధం, మిథునం, దేవస్థానం లాంటి చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు పోషించారు. చివరిసారిగా దేవదాస్ చిత్రంలో నటించారు. నటుడిగానే కాకుండా సంగీత నేపథ్యం ఉన్న టెలివిజన్ షోలకు హోస్ట్‌గా వ్యవహరించారు.

సినీ జీవితం

సినీ జీవితం

ప్రముఖ సంగీత దిగ్గజం ఎస్పీ కోదండపాణి శిష్యరికంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం 1966లో డిసెంబర్ 15 తేదీన శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత తమిళ, కన్నడ, మలయాళ, హిందీ తదితర భాషల్లో వేలాది పాటలు పాడారు. 1981లో ఏక్ దూజే కే లియే చిత్రానికి ఆయనకు జాతీయ అవార్డు లభించింది. 1983లో సాగర సంగమం, 1986లో స్వాతిముత్యం, 1988లో రుద్రవీణ చిత్రాలకు జాతీయ అవార్డులు అందుకొన్నారు.

పలు విభాగంలో ప్రతిభ

పలు విభాగంలో ప్రతిభ

ఎస్పీ బాలసుబ్రమణ్యం గాయకుడు, మ్యూజిక్ డైరెక్టర్‌గా, డబ్బింగ్ హోస్ట్‌గా కాకుండా నటుడిగా అద్బుతమైన పాత్రలు పోషించారు. మన్మధలీలై చిత్రంతో డబ్బింగ్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత కమల్ హాసన్, రజనీకాంత్, విష్ణువర్ధరణ్, సల్మాన్ఖాన్, కే భాగ్యరాజా, అనిల్ కపూర్, గిరీష్ కర్నాడ్, జెమిని గణేషన్, అర్జున్ సర్జా, నాగేశ్, కార్తీక్, రఘువరన్ లాంటి ప్రముఖ నటులకు గాత్రదానం చేశారు.

Recommended Video

Rajinikanth,Pawan Kalyan,K viswanath Expresses Their Condolences For SPB
కరోనా వ్యాధిన పడి

కరోనా వ్యాధిన పడి

సినిమా పరిశ్రమలో సుదీర్ఘమైన అనుభవం కలిగిన ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా వ్యాధి సోకడంతో చెన్నైలోని హాస్పిటల్‌లో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. ఎస్పీ బాలు ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచి కోట్లాది అభిమానులను విషాదంలో ముంచారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X