డైరక్షన్ చేద్దామనుకుంటే 'వేదం' లో ఆఫర్ వచ్చింది
'నాకు సినిమా డైరక్షన్ చేయాలని మొదటి నుంచీ ఆలోచన. అందుకే అహ్మదాబాద్ లో డైరక్షన్ కోర్సులో మాస్టర్స్ డిగ్రీ చేశాను. దర్శకత్వం చేద్దామనుకుంటున్న తరుణంలో నటిగా అవకాశాలు వస్తున్నాయి. అంతా రెడీ అయిందనుకున్న సమయంలో క్రిష్ పిలిచి 'వేదం' లో ఆఫర్ ఇచ్చారు. అందుకే దర్శకత్వం చేయాలన్న కోరికను కొన్నాళ్ళు వాయిదా వేసుకున్నాను" అని అంటోంది లేఖా వాషింగ్టన్. క్రిష్ దర్శకత్వం వహించిన 'వేదం' చిత్రంలో మంచు మనోజ్ కు సరసన చేసింది లేఖ. అలాగే తాను పుట్టి, పెరిగింది చెన్నై అయిన లేఖ ఇప్పటికే తమిళంలో 'జయం కొండాన్', తెలుగులో 'వేదం', కన్నడలో 'తుంటాతుంటి', హిందీలో 'పీటర్ గయా కమ్ సే' చిత్రాల్లో నటించింది. ఈ విషయం మాట్లాడుతూ...ఇప్పటిదాకా ఒక్కో భాషలో ఒక్కో సినిమాలో నటించాను. ఇప్పుడిప్పుడే నటిగా నిలదొక్కుకుంటున్నాను. మేకప్ వేసుకోవడం నుంచి హై హీల్స్ వేసుకోవడం వరకు అన్నీ అలవాటు చేసుకుంటున్నాను. నాకు తమిళ్ బాగా తెలుసు. తెలుగు కూడా నేర్చుకుంటున్నాను" అని చెప్తోంది.


Click it and Unblock the Notifications











