రంగస్థలం అంత పెద్దదా..భారీ రిస్క్ తీసుకుంటున్న సుకుమార్ !
రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రం మార్చి 30 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. రంగస్థలం చిత్రంపై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో అందరికి తెలిసిందే. 1985 నేపథ్యంలో సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రాంచరణ్ చిట్టిబాబుగా, సమంత రామలక్ష్మిగా కనిపించబోతున్నారు. చరణ్ ఈ చిత్రంలో వినికిడి లోపం ఉన్న యువకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. టీజర్ కు, దేవీశ్రీ కంపోజ్ చేసిన సంగీతానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

రంగస్థలం చిత్రం గురించి మరో ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. ఈ చిత్ర నిడివి గురించి వస్తున్న వార్తలు ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉన్నాయి. రంగస్థలం రన్ టైం సుమారుగా 2 గంటల 50 నిముషాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఎంత ఎక్కువ నిడివితో ఏ చిత్రమూ రాలేదనే చెప్పాలి. ప్రేక్షకులు కూడా తక్కువ నిడివి ఉన్న చిత్రాలకు బాగా అలవాటు పడ్డారు. ఇటువంటి సమయంలో 2 గంటల 50 నిమిషాల రన్ టైం అంటే సుకుమార్ రిస్క్ తీసుకుంటున్నాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కథ ఆసక్తికరంగా ఉండాలే కానీ ఎంత నిడివి ఉంటె ఏంటి అనేది మెగా ఫాన్స్ వాదన. చూద్దాం చిట్టిబాబు మ్యాజిక్ ఎలా పనిచేస్తుందో!


Click it and Unblock the Notifications











