అఖిల్ కెరీర్ గురించి నాగార్జున ఆలోచనలు
చైతు తానొక యాక్టర్ ని కావాలని అనుకున్నాడు.నేను సపోర్టుగా ఉన్నాను. అలాగే అఖిల్ ఏమవ్వాలనునుకుంటున్నాడో వాడికే వదిలేసాను.వాడు క్రికెట్ అడతాడో, రగ్బీని ఇష్టపడతాడో,లేదా తను చదువుకుంటున్న ఆస్ట్రేలియా స్కూల్లో స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తాడో చూస్తాను. వాడు వాస్తవంగా ప్రొపిషనల్ క్రికెటర్ కావాలనుకుంటే నేను అలా చేయటానికి రెడీగా ఉన్నాను అన్నారు నాగార్జున. నిన్న(బుధవారం) రాత్రి టైమ్స్ ఫుడ్ గైడ్ అవార్డుల ఫంక్షన్ నిమిత్తం తాజ్ దక్కన్ కి అటెండయిన ఆయన తన కుటుంబం గురించి మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. అలాగే మొన్న స్టార్ టాలివుడ్ క్రికెట్ మ్యాచ్ లో అఖిల్ విజృంభించి ఆడటాన్ని ప్రస్దావిస్తే..చాలా గర్వంగా చూస్తూ..నేను అలా వాడి ఫెరఫార్మెన్స్ చూస్తూ ఉండిపోయాను అన్నారు. పుత్రోత్సాహం తండ్రికి జన్మించినప్పుడు కలగదు..జనాలు వాడిని కనుగొని పొగిడితే కలుగుతుందని శతకకారుడు చెప్పింది నిజమే అనిపిస్తోంది కదూ..


Click it and Unblock the Notifications











