twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమ్మ నగలు అమ్మాల్సి వచ్చింది, ఇలాంటి అక్కచెల్లెళ్లు ఉన్నపుడు నేనెలా ప్రేమిస్తాను: రెహమాన్

    "నేను సంగీత దర్శకుడిగా మారాక నాకు చాలామంది ప్రేమలేఖలు రాయడం మొదలుపెట్టారు. మా ఇంటికి చాలా ప్రేమలేఖలు వచ్చేవట. కానీ నా అక్క చెల్లెళ్లు వాటిని దాచేశారు": రెహమాన్

    |

    మొజర్తా ఆఫ్ మద్రాస్‌గా పేరుపొందిన రెహమాన్ తన సంగీత జీవితాన్ని మొదట రాజ్ కోటిల దగ్గర ప్రారంభించగా, తొలిసారి "యోధ" అనే సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఆ తర్వాత మణి రత్నం దర్శకత్వంలో తెరకెక్కిన రోజా చిత్రంకు రెహమాన్ తనదైన బాణీలు అందించగా, ఈ చిత్రం రెహమాన్ పేరును దేశమంతటా పాకేలా చేసింది.

    గోల్డెన్ గ్లోబ్ అవార్డు

    గోల్డెన్ గ్లోబ్ అవార్డు

    ఇక స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రంలో జైహో అనే పాటకు రెహమాన్ గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకోగా , ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హర్మోనియం, పియానో, కీబోర్డ్ ప్లేయర్‌గా ఇళయరాజా ట్రూప్‌లో పనిచేస్తూ జీవితం ఆరంభించాడు రెహమాన్.

     ఇస్లామ్‌లోకి

    ఇస్లామ్‌లోకి

    1998వ సంవత్సరంలో రెహమాన్ కుటుంబమంతా హిందూ మతం నుండి ఇస్లామ్‌లోకి మారిపోగా అప్పటి నుండి దిలీప్ కుమార్ పేరు రెహమాన్‌గా మారిపోయింది. చిన్నతనంలోనే సంగీతంలో పడిపోయి.. ఆ సముద్రంలోనే మునిగి తేలాడు రెహమాన్. ఐతే తాను ఏ అమ్మాయితోనూ ప్రేమలో పడకపోవడానికి తన అక్కచెల్లెళ్లే కారణమని చెప్పాడు రెహమాన్.

     ప్రేమలేఖలు

    ప్రేమలేఖలు

    "నేను సంగీత దర్శకుడిగా మారాక నాకు చాలామంది ప్రేమలేఖలు రాయడం మొదలుపెట్టారు. మా ఇంటికి చాలా ప్రేమలేఖలు వచ్చేవట. కానీ నా అక్క చెల్లెళ్లు వాటిని దాచేశారు. ఒక్కటీ నా దగ్గరికి రానివ్వలేదు. చాలా లేఖల్ని చించేశారట. ఆ విషయం నాకు చాలా ఆలస్యంగా తెలిసింది. ఇలాంటి అక్కచెల్లెళ్లు ఉన్నపుడు నేనెక్కడ ఏ అమ్మాయినైనా ప్రేమిస్తాను'' అంటూ ఓ ఇంటర్వ్యూలో రెహమాన్ నవ్వేశాడు.

    తల్లి నగలు అమ్మి

    తల్లి నగలు అమ్మి

    తాను సంగీత దర్శకుడిగా ప్రయాణం ఆరంభించే మొదట్లో స్టూడియో పెట్టడం కోసం డబ్బులు లేకపోతే తన తల్లి నగలు ఇచ్చిందని.. 28 ఏళ్ల కిందట కట్టిన ఆ స్టూడియోలోనే తన తొలి జింగిల్స్ చేశానని.. మణిరత్నంకు తన తొలి బాణీ వినిపించింది కూడా ఆ స్టూడియోలోనే అని గుర్తుచేసుకున్నాడు.

    నగల్లో మూడింతలు

    నగల్లో మూడింతలు

    ఆ తర్వాత సంగీత దర్శకుడిగా మంచి పేరు సంపాదించాక తన తల్లికి అంతకుముందున్న నగల్లో మూడింతలు కొనిచ్చినట్లు రెహమాన్ చెప్పాడు. కడపలో పెద్ద దర్గాకు తరచూ రావడం గురించి రెహమాన్ మాట్లాడుతూ.. అక్కడికి వస్తే తన ఒత్తిడంతా మరిచిపోయి ప్రశాంతత కూడగట్టుకుంటానని రెహమాన్ అన్నాడు.

    English summary
    "Let me tell you an interesting story. I came to know that I used to get a lot of love letter initially. But I never got to read even one of those love letters. My sisters used to hide them from my sight. There were instances where they even tore few letters. I came to know about this pretty late in life" AR Rehaman
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X