twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలా అయితే అంజతా-ఎల్లోరా, వాత్సాయన కామసూత్రను కూడా బ్యాన్ చేయాలి: ప్రియాంక

    By Bojja Kumar
    |

    ముంబై: మహిళలపై అఘాయిత్యాలు పెరగడానికి సినిమాలే కారణమని, సినిమాల్లోని కొన్ని అభ్యంతరకర సీన్లే మహిళలపై నేరాలు పెరిగేలా రెచ్చగొడుతున్నాయనే వాదనను.....బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఖండించింది. సినిమాను అనేది ఒక ఆర్ట్(కళ)గా పేర్కొన్న ఆమె....కళను బ్యాన్ చేయాల్సిన పరిస్థితి వస్తే అంజతా-ఎల్లోరా కళాత్మక చిత్రాలను, వాత్సాయనుడి కామసూత్ర లాంటి వాటిని కూడా బ్యాన్ చేయాలని సంచలన వ్యాఖ్యలు చేసింది.

    ప్రజల్లో సహనం రోజు రోజుకు తగ్గిపోతుందని....అందు వల్ల వారు పరిస్థితిని సరిగా అంచనా వేయలేక పోతున్నారని ప్రియాంక అభిప్రాయ పడింది. 'సినిమాలు అనేవి వినోదం కోసమే....మహిళలపై అత్యాచారాలు పెరిగి పోవడానికి సినిమాలే కారణమని ప్రజలు భావిస్తే అంతకంటే ముందుగా అజంతా-ఎల్లోరాల్లోని కళాత్మక చిత్రాలను బ్యాన్ చేయాలి, వాత్సాయన కామసూత్ర లాంటి గ్రంధాలను బ్యాన్ చేయాలి' అని ప్రియాంక వాదిస్తోంది.

    Priyanka Chopra

    మన దేశంలో సినిమాలను పర్యవేక్షించడానికి సెన్సార్ బోర్డులు ఎన్నాయి. సెన్సార్ సర్టిఫికెట్ పొందిన తర్వాతనే ఏ సినిమా అయినా విడుదలవుతుంది. సినిమా తీరును బట్టి......అది పెద్దలు చూడాల్సిన సినిమానా? పిల్లలు, పెద్దలు కలిసి చూడాల్సిన సినిమానా? అనే సర్టిఫికెట్ వస్తుంది.

    చాలా మంది మన దేశంలో 'A' సర్టిఫికెట్ ఉన్న సినిమాలు కూడా పిల్లలను తీసుకుని వెలుతున్నారు. అసలు పిల్లను 'A' సర్టిఫికెట్ ఉన్న సినిమాలకు ఎలా అనుమతిస్తారు? ముందు ఇక్కడ ఎవరూ రూల్స్ పాటించడం లేదు అంటూ ప్రియాంక తనదైన కోణంలో సినిమాలను సమర్థిస్తూ వచ్చింది.

    'మన వ్యవస్థలో పకడ్బంధీగా రూల్స్ ఉన్నాయి. కానీ వాటిని ఎవరూ పాటించడం లేదు. ఆచరణకు నోచుకోవడం లేదు. ఎలాంటి భయం లేకుండా రూల్స్ ఉల్లంఘిస్తున్నారు అని వ్యాఖ్యానించిన ప్రియాంక... 'సంగీతం, పుస్తకాలు మాదిరిగానే సినిమా ఇండస్ట్రీ అనేది కూడా వినోదం కోసమే. వాటిలో రకరకాల కేటగిరీలు ఉన్నట్లే సినిమాల్లో కూడా వివిధ రకాల కేటగిరీలు ఉన్నాయి.' అని ప్రియాంక చెప్పుకొచ్చింది.

    ప్రియాంక ఈ రేంజిలో రెచ్చిపోయి మాట్లాడటానికి కారణం.....ఆమె చేసే సెక్సీ ఐటం సాంగులపై విమర్శలు రావడమేనట. ఆమె చేసే ఐటం సాంగులు రెచ్చగొట్టేలా ఉన్నాయనే మాట ప్రియాం చెవిన పడటంతో ఇలా స్పందించిందని అంటున్నారు.

    English summary
    If art provocates crimes against women, historic sites like Ajanta-Ellora and Vatsayana's "Kamasutra" must be banned, says Indian actress Priyanka Chopra, who believes cinema is an "art" too and it should not be blamed for the rising crimes against women in the nation.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X