తమన్నా ట్విట్టర్ లో చేరింది..అడ్రస్ ఇదే
హైదరాబాద్ : స్టార్స్ కు, వారి ఫాన్స్ కు మధ్య వారధిగా సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు కీలక భూమిక పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు తమ అభిమాన హీరో లేదా హీరోయిన్స్ అప్ డేట్స్ తెలుసుకోవాలని ఉత్సాహపడే ఫ్యాన్స్ కు ఇవి అమృత భాంఢాలుగా కనిపిస్తున్నాయి. అలాగే వారిపై అభిమానులతో తమ మనసులోని భావాల్ని పంచుకోవడానికి అవి చక్కటి వేదికలుగా నిలుస్తున్నాయి. సోషల్‌నెట్‌వర్కింగ్ సైట్లకు దూరంగా వుంటూ వస్తోన్న మిల్కీబ్యూటీ తమన్నా తాజాగా ట్విట్టర్‌లో చేరింది.
వాస్తవానికి తమన్నా కాస్త ఆలస్యంగా మేల్కొంది. తన తోటి హీరోయిన్లంతా ఎప్పటి నుంచో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల ద్వారా అభిమానులతో టచ్‌లో వుంటుంటే, ఈమె మాత్రం ఇన్నాళ్లూ వాటికి దూరంగా వుంది. ఇక తను కూడా అభిమానులకు చేరువలో వుండాలని నిర్ణయం తీసుకుంది. తాజాగా ట్విట్టెర్లో అకౌంట్ ఓపెన్ చేసింది. ఇలా ట్విట్లర్ ద్వారా స్నేహితులతోనూ, అభిమానులతోనూ కాంటాక్ట్‌లోకి వచ్చినందుకు చాలా హ్యాపీగా వుందని ఈ ముద్దుగుమ్మ చెబుతోంది. ఇకపై తన గురించిన వివరాలను, విశేషాలను, ఫోటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుందట.
ఆమె ట్విట్టర్ అడ్రస్ ఇదే..
https://twitter.com/tamannaahspeaks
తను ట్విట్టర్ ఖాతాను తెరుస్తున్నట్లు అభిమానులకు తెలిపింది. బిజీ షూటింగ్ షెడ్యూళ్ల వల్లే ఇన్నాళ్లు ట్విట్టర్‌కు దూరంగా వున్నానని చెప్పింది. ఇకనుంచి తన చిత్రాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తానని, ఈ రకంగా అభిమానుల్ని పలకరించడం సరికొత్త అనుభూతినిస్తోందని పేర్కొంది. ప్రస్తుతం ఈ సుందరి హిందీలో రెండు చిత్రాలతో పాటు తెలుగులో మహేష్‌బాబు సరసన 'ఆగడు' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications












