యాక్షన్, ఫన్, రొమాన్స్, థ్రిల్..... నితిన్ ‘లై’ ట్రైలర్ సూపర్బ్
నితిన్ ‘లై’ మూవీ ట్రైలర్ రిలీజైంది. ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది.
నితిన్ హీరోగా వెంకట్ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'లై' (లవ్ ఇంటెలిజెన్స్ ఎన్‌మిటి). రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ శనివారం హైదరాబాద్‌లోజరిగింది. ఈ సందర్భంగా థియేట్రికల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్ రిలీజైన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా సినిమాలో నితిన్ లుక్ సరికొత్తగా ఉంది.
'లై' మూవీ యాక్షన్ ప్యాక్డ్స్ గా ఉండబోతోందని తెలుస్తోంది. దీంతో పాటు ప్రేక్షకులను ఎంటర్టెన్ చేసే ఫన్ ఎలిమెంట్స్, యువతను ఆకట్టుకునే రొమాంటిక్ ఎలిమెంట్స్ లాంటి వాటికి థ్రిల్ జోడించి ఎంతో ఆసక్తికరంగా సినిమా ఉండబోతోందని స్పష్టమవుతోంది.
నితిన్, మేఘా ఆకాష్, యాక్షన్ కింగ్ అర్జున్, శ్రీరామ్, రవికిషన్, పృథ్వీ, బ్రహ్మాజీ, తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: యువరాజ్, సంగీతం: మణిశర్మ, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, డాన్స్: రాజు సుందరం, ఫైట్స్: కిచ్చా, పాటలు: కృష్ణకాంత్, లైన్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా, సమర్పణ: వెంకట్ బోయనపల్లి, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హను రాఘవపూడి.


Click it and Unblock the Notifications











