భయపడే వారు, హార్ట్ పేషెంట్స్ ఈ సినిమా చూడొద్దు!
హైదరాబాద్: భయపడే వారు, హార్ట్ పేషెంట్స్ ఈ సినిమా చూడొద్దు అంటూ.......ఓ పోస్టర్ విడుదల చేసారు విధాత మోషన్ పిక్చర్స్ వారు. ఈ సంస్థపై తాజాగా ‘లైఫ్ ఆఫ్టర్ డెత్' అనే సినిమా తరకెక్కుతోంది. హారర్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కబోతోంది.
ఈ చిత్రానికి గంగాధర్ రాజరపు దర్శత్వం వహిస్తున్నారు. శశి, వెంకట భరద్వాజ్ రెడ్డి నిర్మాతలు. శ్రవన్, శ్రీకాంత్, యతిరాజ్, శ్యామల్ సిక్దర్, శ్రీనివాస్ వరగంటి టెక్నీషియన్లుగా పని చేస్తున్నారు. ప్రస్తుతానికి ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రమే విడుదలైంది. త్వరలో ఈచిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

Recommended Video

ఈ మధ్య కాలంలో తెలుగులో రొటీన్ కమర్షియల్ చిత్రాలకు ఆదరణ తగ్గింది. సస్పెన్స్, హారర్...ప్రేక్షకులను ఆద్యంతం థ్రిల్లింగుకు గురి చేసే చిత్రాలకు ఆదరణ పెరిగింది. ఈ నేపథ్యంలో ఇలాంటి చిత్రాలను రూపొందించేందకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. అలాంటి తరహా సినిమాలనే ఈ ‘లైఫ్ ఆఫ్టర్ డెత్'.


Click it and Unblock the Notifications