»   »  తెలంగాణ ఎంపీ కవిత సహకారంతో ‘లైఫ్ ఎగైన్’ ఫిల్మ్

తెలంగాణ ఎంపీ కవిత సహకారంతో ‘లైఫ్ ఎగైన్’ ఫిల్మ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్లో స్ఫూర్తినింపుతూ తన స్వీయ అనుభవాలతో హైమారెడ్డి నటిస్తూ దర్శకత్వం వహించిన ‘లైఫ్ ఎగైన్' లఘు చిత్ర ట్త్రెలర్ ఆవిష్కరణ మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. తెలంగాణ జాగృతి సమర్పణలో ఎస్.కె.ఆర్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత, సీనియర్ నటి గౌతమి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ...క్యాన్సర్‌లాంటి ప్రాణాంతక వ్యాధిని జయించడంతో పాటు బాధితుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి లఘ చిత్రాన్ని నిర్మించిన హైమారెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. క్యాన్సర్ కేవలం రోగిని మాత్రమే కాకుండా చుట్టూ వున్న కుటుంబ సభ్యుల్ని కూడా మానసిక వేదనకు గురిచేస్తుంది. లైఫ్ ఎగైన్ చిత్రం క్యాన్సర్ రోగుల్లో బ్రతకాలనే ఆకాంక్షను నింపుతుందని, వారిలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోదిచేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

'Life Again' short film

ఇలాంటి సందేశాత్మక చిత్రాలకు ప్రభుత్వం తరపున పన్ను రాయితీని ఇప్పించేందుకు అవసరమైతే ముఖ్యమంత్రి కేసీఆర్‌గారిని కలిసి చర్చిస్తాను అన్నారు. గౌతమి మాట్లాడుతూ రెండు రకాల క్యాన్సర్స్ వచ్చినా సడలని విశ్వాసంతో చికిత్స తీసుకొని సంవత్సరం తిరిగే లోపే బాహ్యజీవితంలోకి అడుగుపెట్టింది హైమారెడ్డి. నా దృష్టిలో ఇలాంటివారే నిజమైన హీరోలు. క్యాన్సర్ ఎవరికైనా రావొచ్చు. అందరిలో ఈ లైఫ్ ఎగైన్ చిత్రం స్ఫూర్తినింపుతుందని ఆశిస్తున్నాను.

కవిత సహాయసహకారాలతో లైఫ్ ఎగైన్ చిత్రం ప్రతి ఒక్కరికి చేరువవ్వాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు. తాను క్యాన్సర్‌ను జయించడానికి గౌతమి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకున్నానని, ఎంపీ కవిత సహాయసహకారాలతో లఘు చిత్రాన్ని నిర్మించానని హైమారెడ్డి తెలిపారు. ఈ లఘు చిత్రానికి సంగీతం: కార్తీక్ కొడకండ్ల, కెమెరా: ప్రవీణ్, పాటలు: కిట్టు విస్సాప్రగడ, దర్శకత్వం: హైమారెడ్డి.

English summary
'Life Again' film shows the life of a woman affected with cancer. Directed by a real life cancer survivor Hyma Reddy, Life Again features yesteryear's actress and cancer survivor Gauthami, filmmaker Raj Kandukuri and Hyma Reddy in prominent roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu